పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు పాకిస్థాన్ విడిచివెళ్లిపోయే ఛాన్స్ వచ్చినా కూడా ఇందుకు ఒప్పుకోలేదని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. '' నేను అటోల్ జైల్లో ఉన్నరోజుల్లో మూడేళ్ల వరకు దేశం విడిచి వెళ్లిపోయేందుకు ఛాన్స్ వచ్చింది. కానీ ఇందుకు నేను ఒప్పుకోలేదు. నేనిక్కడే ఉంటాను. ఇక్కడే మరణిస్తాను. ఎప్పుడూ కూడా నా మాట ఒక్కటే. పోలీసులు అదుపులోకి తీసుకున్న మా పార్టీ నేతలు, కార్యకర్తలను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలి. నా వ్యక్తిగత పరిస్థితి గురించి చర్చించడం ఆలోచిస్తాను. పాకిస్థాన్‌కు సంబంధించిన నిర్ణయాలన్నీ కూడా స్వదేశంలోనే తీసుకోవాలనేది నా అభిప్రాయమని'' ఇమ్రాన్ ఖాన్ అన్నారు. Also Read: అగ్రరాజ్యంలో ఆగని కాల్పులు..ఆ విషయంలో అమెరికా ఫెయిల్! అలాగే షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై కూడా ఇమ్రాన్ ఖాన్ తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలకు అందాల్సిన హక్కులు అణిచివేతకు గురైనప్పుడు అంతర్జాతీయంగా ఉన్న గళాలు బలంగా వినిపిస్తాయని అన్నారు. ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలు ఉంది కూడా అందుకే కదా అని అన్నారు. ముషారఫ్ పాలనలో మిలటరీ జోక్యం ఉందని విమర్శలు వచ్చినా కూడా ఈ స్థాయిలో అణిచివేత లేదని ధ్వజమెత్తారు. Former Prime Minister Imran Khan in conversation with media representatives in Adiala Jail - January 2, 2025"Happy New Year to everyone! 2025 is the year of our genuine freedom, in which, God willing, this fake and fascist system that is already on shaky grounds, will be… — Imran Khan (@ImranKhanPTI) January 3, 2025 Also Read: ఢిల్లీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కేజ్రీవాల్‌పై పోటీ ఎవరో తెలుసా? ఇదిలాఉండగా.. ఇమ్రాన్ ఖాన్‌పై దాదాపు 200 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన అడియాలా జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. తోషఖానా, సైఫర్ లాంటి తదితరల కేసుల్లో ఇమ్రాన్ ఖాన్ గత ఏడాది నుంచి జైల్లోనే ఉంటున్నారు. అయితే ఇటీవల పీటీఐ (పాకిస్థాన్ తెహ్రాక్-ఈ-ఇన్సాఫ్) పార్టీ శ్రేణులు.. ఇమ్రాన్ ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలని పెద్దఎత్తున నిరసనలు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకొని జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇమ్రాన్ ఖాన్ నుంచి సంచలన పోస్ట్ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. Also Read: తల్లిదండ్రుల పర్మిషన్ ఉండాల్సిందే..సోషల్ మీడియాపై కేంద్రం నిర్ణయం!