హైదరాబాద్‌లో ప్రస్తుతం తెలుగు మహాసభలు కొనసాగతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ సభలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాట్లాడటం, రాయడం ద్వారానే తెలుగు భాషను పరిరక్షించగలమని అన్నారు. పిల్లలతో బాలసాహిత్యం చదివించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. డిజిటల్ విభాగంలో తెలుగు భాషను క్రోడీకరించి రాబోయే తరాలకు అందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. Also Read: మల్లారెడ్డి కాలేజీ సీజ్.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం! అలాగే డిజిటల్ రంగంలో మాతృభాష అభివృద్ధికి, సంరక్షణకు దోహదం చేయాలని తెలిపారు. ప్రస్తుతం వికీపీడియాలో కూడా తెలుగు వ్యాసాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందన్నారు. వ్యాసాలు, కథలు, కథనాలు ఆడియో రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. తెలుగు భాష కనుమరుగు కాకముందే దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అధికార, పాలన వ్యవహారాలు తెలుగులోనే జరగాలని తెలిపారు. Also Read: ఢిల్లీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కేజ్రీవాల్‌పై పోటీ ఎవరో తెలుసా? '' కొత్త సాంకేతిక, కార్యక్రమాలను కూడా మాతృభాషలోనే చెపట్టాలి. వాడుక భాషల్లో చూసుకుంటే 30 శాతం మాత్రమే తెలుగులో ఉంది. 70 శాతం ఆంగ్ల పదాలే ఉంటున్నాయి. మనకు తెలియకుండానే తెలుగు భాష కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంటుంది. పిల్లలందరికీ కూడా ప్రాథమిక స్థాయి వరకు మాతృభాషలోనే విద్య ఉండాలి. కేంద్రం తీసుకొచ్చిన కొత్త విద్యా విధానాన్ని అమలు చేయాలి. న్యాయస్థానాల్లో వాదనలు, ప్రతివాదనలు కూడా తెలుగులోనే ఉండాలి. కోర్టు తీర్పులు తెలుగులోనే ఉండాలి. అలాగే సినిమాల పేర్లు కూడా తెలుగులోనే ఉంటే బాగుంటుందని'' కిషన్ రెడ్డి అన్నారు. Live: Attending the award function at the 12th Biennial Conference of the World Telugu Federation at the Novotel Convention Center, Hyderabad. https://t.co/NrNpI4fxkI — G Kishan Reddy (@kishanreddybjp) January 4, 2025 Also Read: అగ్రరాజ్యంలో ఆగని కాల్పులు..ఆ విషయంలో అమెరికా ఫెయిల్! Also Read: ఐదేళ్ల క్రితం కరోనా.. ఇప్పుడు HMPV.. చైనాలో అసలేం జరుగుతోంది?