/rtv/media/media_files/2024/12/26/boYrGufYM5l3aHL6PJEa.jpg)
Ch.Srinivasa Rao
భారత వ్యవసాయ పరిశోధన సంస్థకు డైరెక్టర్‌గా మొట్టమొదటిసారి ఒక తెలుగు వ్యక్తిని నియమించారు. ప్రస్తుతం నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్‌గా ఉన్న శ్రీనివాసరావును ఐఏఆర్ఐకు డైరెక్టర్‌గా నియమించారు. ఈ సంస్థకు డైరెక్టర్‌గా ఒక తెలుగు వ్యక్తిని నియమించడం ఇదే మొదటిసారి.
శ్రీనివాసరావు 1965 అక్టోబరు 4న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా అనిగండ్లపాడులో జన్మించారు. 1975-80 వరకు అనిగండ్లపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్న తర్వాత.. బాపట్ల వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చరల్ బీఎస్‌సీ పట్టా అందుకున్నారు. ఆతరువాత శ్రీనివాసరావు ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఎంఎస్‌సీ, పీహెచ్‌డీ పూర్తి చేశారు. దీని తరువాత ఇజ్రాయెల్ టెల్-అవివ్ విశ్వవిద్యాలయంలో పోస్ట్-డాక్టోరల్ చేశారు. చదువు అయ్యాక శ్రీనివాసరావు భారత్‌లోని పలు పరిశోధన సంస్థల్లో వివిధ హాదాల్లో పనిచేశారు.