Harish rao: వాటిని ప్రమోట్ చేసేందుకే బీర్లు నిలిపివేస్తున్నారా: హరీశ్‌ రావు

తెలంగాణలో బీర్ల అమ్మకాలను నిలిపివేయాలని యూనైటెడ్ బ్రూవరీస్ తీసుకున్న నిర్ణయంపై హరీశ్‌ రావు అనుమానం వ్యక్తం చేశారు. బూంబూం బీర్, బిర్యానీ వంటి లోకల్‌ బ్రాండ్లను ప్రమోట్ చేసేందుకే ఉద్దేశపూర్వకంగా ఇలా ప్రయత్నిస్తున్నారా అని ప్రశ్నించారు.

New Update
Beers and Harish Rao

Beers and Harish Rao

తెలంగాణలో బీర్ల అమ్మకాలను నిలిపివేయాలని యూనైటెడ్ బ్రూవరీస్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై మాజీ మంత్రి హరీశ్‌ రావు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పలు కీలక ప్రశ్నలు లేవనెత్తారు. '' తెలంగాణ ప్రభుత్వానికి బీర్ల అమ్మకాలను నిలిపివేయాలని యూనైటెడ్ బ్రూవరీస్ నిర్ణయం తీసుకోవడం పలు కీలకమైన ప్రశ్నలను లేవనెత్తింది. గతంలో బీర్ల సరఫరాకు సంబంధించి బకాయిలు చెల్లించడంలో తెలంగాణ గవర్నమెంట్ బివరేజ్ కార్పొరేషన్ (TGBCL) విఫలమైందని యూనైటెట్ బ్రూవరీస్ (UB) తెలిపింది. 

Also Read: తెలంగాణ కోర్టుల్లో 1673 ఖాళీలు.. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం!

బీర్ల సరఫరాను యూబీ నిలిపివేయడం వల్ల తెలంగాణలో ప్రీమియం బ్రాండ్లయిన కింగ్‌ఫిషర్, హీనెకెన్ వంటి బీర్లకు అంతరాయం కలిగే అవకాశం ఉంటుంది. బూంబూం బీర్, బిర్యానీ వంటి లోకల్‌ బ్రాండ్లను ప్రమోట్ చేసేందుకే ఉద్దేశపూర్వకంగా ఈ ప్రయత్నం చేస్తున్నారా ?  బిల్లుల చెల్లింపులో సీనియారిటీ లేదా మెరిట్‌ విధానానికి కాకుండా ప్రత్యేక ప్రాధాన్యతల వల్లే ఇలాంటి పరిస్థితి తలెత్తిందా ? అని'' హరీశ్‌ రావు ప్రశ్నించారు. 

ఇదిలాఉండగా తెలంగాణలో కింగ్‌ఫిషర్, హీనెకెన్ సహా ఏడు రకాల బీర్ల సరఫరా నిలిచిపోనుంది. ఐదేళ్లుగా బీర్ల ధరలు పెంచకపోవడం వల్ల తమకు భారీగా నష్టాలు వస్తున్నాయని యూబీ తెలిపింది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. బుధవారం యూబీ ప్రతినిధులు ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌ను కలిశారు. తెలంగాణకు పూర్తిగా బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు లేఖ ఇచ్చారు. ధరలు పెంచాలని గతంలో ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని ఆ లేఖలో తెలిపారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. 

Also Read: కేటీఆర్ చెప్పినట్లే చేశా.. ACB విచారణలో బాంబ్ పేల్చిన అరవింద్!

Advertisment
తాజా కథనాలు