భాష ఆగిపోతే.. శ్వాస ఆగిపోయినట్లే : వెంకయ్య నాయుడు

హైదరాబాద్‌లో జరుగుతున్న తెలుగు మహాసభల్లో మజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. తెలుగు భాషకు మనమందరం వారసులమని.. దీన్ని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత మనదేనన్నారు. భాష ఆగితే శ్వాస ఆగిపోయినట్లేనని వ్యాఖ్యానించారు.

New Update
Venkaiah Naidu

Venkaiah Naidu

హైదరాబాద్‌లో జరుగుతున్న అంతర్జాతీయ తెలుగు సమాఖ్య మహాసభల్లో మజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు భాషకు మనమందరం వారసులమని.. దీన్ని భవిష్యత్తు తరాలకు అందించాల్సిన బాధ్యత మనదేనన్నారు. మాతృభాషను మనం కాకుంటే ఇంకెవరు ప్రేమిస్తారని ప్రశ్నించారు. అందరికీ మన మాతృభాష తెలుగులో మాట్లాడటం అలవాటు కావాలన్నారు. దేశంలో ప్రస్తుతం గొప్ప పదవుల్లో ఉన్నవాళ్లందరూ కూడా మాతృభాషలో చదువుకున్నవారేనని తెలిపారు. అలాగే తన ఉన్నతికి కూడా తెలుగే కారణమని పేర్కొన్నారు.  

Also Read: మల్లారెడ్డి తమ్ముడిపై కేసు.. సీక్రెట్ కెమెరాల వ్యవహారంలో బిగ్ ట్విస్ట్!

'' అప్పట్లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సభలను అమెరికాలో మొదలుపెట్టారు. అప్పుడు కూడా నేను ఆ సభలో పాల్గొన్నాను. వివిధ దేశాల్లో ఉన్న తెలుగువారందరినీ ఒకే వేదికపై తీసుకురావడం గొప్ప విషయం. తెలుగు భాషను మన ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత మనపైనే ఉంది. ప్రతీభాషకు కూడా ఓ ప్రత్యేకత ఉంటుంది. తెలుగు ఎంతో విలక్షణమైన భాష. మన భాషకు అలంకారాలు మరింత అందాన్ని తీసుకొచ్చాయి.  

Also Read: ఏపీకి మరో 52 సంక్రాంతి స్పెషల్ ట్రైన్లు.. లిస్ట్ ఇదే!

జీవిత అర్థాలను తెలిపే సామెతలు తెలుగులో చాలా ఉన్నాయి. మన సంస్కృతిని మాతృభాష తనలో ఇముడ్చుకుంది. 2012లో ప్రపంచంలోనే రెండో ఉత్తమ లిపిగా తెలుగు రికార్డు సృష్టించింది. భారత్‌లో 450 వరకు భాషలు ఉన్నాయి. ఇంగ్లీష్ భాష వ్యామోహం వల్ల కొన్ని భాషలు అంతరించిపోతున్న పరిస్థితులు వస్తున్నాయి. భాష ఆగితే శ్వాస ఆగిపోయినట్లే. మాతృభాష మర్చిపోతే.. మాతృబంధం కూడా విడిపోయినట్లే. ప్రాథమిక విద్యను తెలుగు భాషలోనే అందించాలని'' వెంకయ్య నాయుడు తెలిపారు. 

Also Read: ప్రియాంక గాంధీ బుగ్గల్లా రోడ్లు మారుస్తా : బీజేపీ నేత సంచలన కామెంట్స్

Also Read: ఈవీఎంలపై అనుమానంతో ఆ గ్రామంలో చట్టవిరుద్ధంగా ఎన్నికలు.. చివరికి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు