నేషనల్ దారుణం.. ఒకే కుటుంబంలో ఏడుగురి సజీవ దహనం మహారాష్ట్రలోని ముంబయిలో దారుణం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగడంతో ఏడుగురు సజీవదహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. ఒకే కుటంబంలో ఏడుగురు మృతి చెందడంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. By B Aravind 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ లెబనాన్‌లో బాంబుల మోత.. విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ పశ్చిమాసియాలో తీవ్ర ఉదిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లెబనాన్‌పై దాడులను ఇజ్రాయెల్ మరింత ఉద్ధృతం చేసింది. తాజాగా బీరుట్ దక్షిణ ప్రాంతంలో డజనుకుపైగా వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో లెబనాన్ పౌరులు మృతి చెందారు. By B Aravind 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ కాసేపట్లో రాజేంద్రప్రసాద్ కుమార్తె అంత్యక్రియలు కాసేపట్లో రాజేంద్రప్రసాద్ కుమార్తెకు అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయన కుమార్తె గాయత్రి శనివారం గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు కేపీహెచ్‌పీలోని కైలాసవాసంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. By B Aravind 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రిజర్వేన్లపై 50 శాతం పరిమితిని తొలగించాల్సిందే: రాహుల్ గాంధీ ప్రస్తుతం రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తొలగించడం రాజ్యాంగ పరిరక్షణకు అవసరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. ఇందుకోసం పార్లమెంటులో బిల్లులు ఆమోదించేందుకు ఇండియా కూటమి చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. By B Aravind 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ భోలేబాబా డెయిరీ నుంచే తిరుమలకు నెయ్యి .. వెలుగులోకి సంచలన నిజాలు టీటీడీలో నెయ్యి కల్తీ అయ్యిందనే ఆరోపణలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి వాణిజ్య పన్నుల శాఖ పలు కీలక విషయాలు వెల్లడించింది. ఈ నెయ్యి మూలాలు ఉత్తరాఖండ్‌లోని భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద ఉన్నట్లు తేలింది. By B Aravind 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య నిజామాబాద్ జిల్లాలోని ఎడవల్లి మండలం వడ్డేపల్లిలో దారుణం జరిగింది. అప్పుల బాధ తట్టుకోలేక ఒకే కుటుంబంలో ముగ్గురు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతులు సురేశ్ (53), హేమలత (45), హరీశ్(22)గా గుర్తించారు. By B Aravind 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ దేశవ్యాప్తంగా 22 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు.. దేశవ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు చేపట్టింది. మొత్తం 22 ప్రాంతాల్లో ఎన్ఐఏ ఆకస్మిక తనిఖీలు చేస్తోంది. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసు విచారణలో భాగంగానే ఈ తనిఖీలు చేస్తున్నట్లు తెలుస్తోంది. By B Aravind 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ పెను విషాదం 600 మందిని కాల్చి చంపేశారు.. పశ్చిమాఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో పెను విషాదం చోటుచేసుకుంది. బర్సాలోగా అనే పట్టణంలో ఉగ్రవాదులు దారుణానికి పాల్పడ్డారు. కొన్ని గంటల్లోనే దాదాపు 600 మంది ప్రజలను కాల్చి చంపేశారు. ఆగస్టులో జరిగిన ఈ భయానక ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. By B Aravind 05 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ విషాదం.. కొడుకు మరణ వార్త విని తల్లి మృతి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మద్దింశెట్టి ఆదిబాబు (46) అనే వ్యక్తి అనారోగ్యంతో శుక్రవారం ఉదయం మృతిచెందారు. దీంతో మృతుడి తల్లి మహాలక్ష్మీ (76) తీవ్ర అస్వస్థకు గురయ్యారు.ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ఆమె కూడా మృతి చెందారు. By B Aravind 04 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn