/rtv/media/media_files/2026/01/15/chip-shortage-2026-01-15-17-03-12.jpg)
As chip shortages push phone prices up, OPPO bets on value over panic
మీరు కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నారా ?. అయితే మీకో షాకింగ్ న్యూస్. త్వరలోనే మొబైల్ ఫోన్ల ధరలు పెరగబోతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో మెమోరీ చిప్ సంక్షోభం నెలకొంది. దీంతో స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరగనున్నాయి. ఏఐ డేటా సెంటర్లు విపరీతంగా పెరుగుతున్న కారణం వల్లే ప్రపంచవ్యాప్తంగా డైనమిక్ రాండమ్ యాక్సెస్ మెమోరీ (DRAM), స్టోరేజ్ చిప్‌ల కొరత ఏర్పడింది. గతంలో స్మార్ట్‌ఫోన్లలో వాడే ఈ రకమైన మెమోరీని ఇప్పుడు ఏఐ డేటా సెంటర్లు భారీగా కొనుగోలు చేస్తున్నాయి.
Also Read: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో వివాదం.. సిరాకు బదులు మార్కర్ పెన్నులు
చిప్ తయారీ కంపెనీలు కూడా సాధారణ వినియోగదారుల పరికరాల కంటే.. ఎక్కువ లాభం ఇచ్చే AI సర్వర్ల చిప్‌ల తయారీకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో మార్కెట్‌లో చిప్‌ల సరఫరా తగ్గి, స్మార్ట్‌ఫోన్లు, లాప్‌టాప్‌ల ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. చిప్ కొరత వల్ల స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరిగే ఛాన్స్ ఉన్నప్పటికీ ప్రముఖ మొబైల్ సంస్థ OPPO మాత్రం ఆందోళన చెందడం లేదు. వినియోగదారులు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదని చెబుతోంది. వినియోగదారులకు తగినంత కొత్తదనాన్ని ఇస్తూ.. వాళ్ల అవసరాలకు అనుగుణంగా ఉంటే, ధరల పెరుగుదల పెద్ద సవాలు కాదని చెబుతోంది.
Also Read: బైడెన్ నాలుగేళ్లలో చేసింది.. ట్రంప్ ఏడాదిలోనే చేశాడు.. ప్రపంచాన్ని వణికించే రిపోర్ట్!
ప్రస్తుత రోజుల్లో ప్రజలు ధర పెరిగిందని తక్కువ నాణ్యత ఉండే చౌక ఫోన్ల వైపు మొగ్గు చూపడం లేదని OPPO ఇండియా బ్రాండ్ కమ్యూనికేషన్స్ హెడ్ గోల్డీ పట్నాయక్ తెలిపారు. ఫోన్ క్వాలిటీ, సౌలభ్యాన్ని బట్టి ఎక్కువ ధరలు పెట్టేందుకు వెనకాడటం లేదని అన్నారు. ఇదిలాఉండగా 2024 ప్రారంభంలో జనరేటివ్ ఏఐ ఫోన్‌ల రవాణా 3 శాతం ఉంటే 2025 ప్రారంభం నాటికి ఏకంగా 13 శాతానికి చేరింది.
Follow Us