/rtv/media/media_files/2026/01/15/maharashtra-bmc-election-exit-poll-results-2026-2026-01-15-21-02-07.jpg)
Maharashtra BMC Election Exit poll Results 2026
మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు గురువారం ముగిశాయి. రాష్ట్రంలోని మొత్తం 29 మున్సిపల్ కార్పొరేషన్‌లో 2,869 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 7.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఓటింగ్ జరిగింది. దేశ ఆర్థిక రాజధాని ముంబయి సివిక్ బాడీ బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార, విపక్ష పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. మొత్తంగా అక్కడ 227 స్థానాలు ఉండగా మెజార్టీకి 114 స్థానాల్లో గెలవాలి.
Also Read: రెచ్చిపోతున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్..ఢిల్లీ, కెనడాల్లో వరుస కాల్పులు
మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఆయా సంస్థలు రిలీజ్ చేసిన సర్వేలు BCMలో బీజేపీ (షిండే కూటమి) గెలుస్తున్నట్లు వెల్లడించాయి.ఈ ఎన్నికల్లో థాక్రే సోదరులు కలిసినప్పటికీ కూడా వీళ్ల కూటమి రెండో స్థానానికి పరిమితం అవుతుందని లెక్కగట్టాయి. కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పరిమితం కానుందని అంచనా వేశాయి. ఈసారి కూడా యువ, మహిళా ఓటర్లు బీజేపీకే ఓటు వేసినట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా ఈ ఎన్నికల కౌంటింగ్ రేపు జరగనుంది.
టైమ్స్ నౌ:
బీజేపీ కూటమి 129-146
శివసేన యూబీటీ కూటమి 54-64
కాంగ్రెస్ కూటమి 21-25
ఇతరులు6-9
జేవీసీ:
బీజేపీ కూటమి 138
శివసేన యూబీటీ కూటమి 59
కాంగ్రెస్ -23
ఇతరులు 7
యాక్సిస్ మై ఇండియా:
బీజేపీ కూటమి 131-151
శివసేన యూబీటీ కూటమి 58-68
కాంగ్రెస్ కూటమి 12-16
ఇతరులు 6-12
Follow Us