Maharashtra Civic Polls: మహారాష్ట్ర ఎన్నికల్లో గౌరీ లంకేశ్‌ హత్య కేసు నిందితుడు గెలుపు

2017లో ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న శ్రీకాంత్‌ పాంగార్కర్‌ మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో గెలిచాడు.

New Update
Gauri Lankesh murder case accused Shrikant Pangarkar wins Jalna civic poll as Independent

Gauri Lankesh murder case accused Shrikant Pangarkar wins Jalna civic poll as Independent

2017లో ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న శ్రీకాంత్‌ పాంగార్కర్‌ మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో గెలిచాడు. జాల్నా కార్పొరేషన్‌లో 13వ వార్డు నుంచి ఇండిపెండంట్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించాడు. ఈ స్థానంలో బీజేపీతో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు బరిలోకి దిగారు. శివసేన (షిండే) పార్టీ మాత్రం తమ అభ్యర్థిని ఇక్కడ నిలబెట్టలేదు. 

Also Read: 4 ఏళ్లలో 3.3 లక్షల మంది దుర్మరణం..బైక్ ప్రమాదాల్లో చనిపోతున్న జనాలు

గతేడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు శ్రీకాంత్ పాంగార్కర్‌ శివసేనలో చేరాడు. దీనిపై తీవ్రంగా అభ్యంతరాలు, విమర్శలు వచ్చాయి. దీంతో ఆయన అభ్యర్థిత్వాన్ని షిండే నిలిపివేశరు. 2001 నుంచి 2006లో శివసేన తరఫున జాల్నా మున్సిపల్ కౌన్సిల్ సభ్యుడిగా శ్రీకాంత్ ఉన్నారు. 2011లో ఆయకు పార్టీ టికెట్ రాకపోవడంతో హిందూ జనజాగృతి సమితిలో చేరాడు. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు. 

Also Read: చైనాకు వ్యతిరేకంగా ఒక్కటైనా జపాన్, ఫిలిప్పీన్స్.. కీలక ఒప్పందం చేసుకున్న ఇరుదేశాలు

ఇక 2017 సెప్టెంబర్‌లో బెంగళూరులోని జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ను ఆమె నివాసంలో దుండగులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ కేసులో నిందితుడిగా తేలిన శ్రీకాంత్‌ పాంగార్కర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత 2024లో కర్ణాటక హైకోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు 2018లో బాంబులు, ఆయుధాలు దొరికిన కేసులో కూడా ఆయన అరెస్టయ్యారు. 

Advertisment
తాజా కథనాలు