చైనాకు వ్యతిరేకంగా ఒక్కటైనా జపాన్, ఫిలిప్పీన్స్.. కీలక ఒప్పందం చేసుకున్న ఇరుదేశాలు

భారత్‌ మిత్రదేశాలైన జపాన్, ఫిలిప్పీన్స్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. చైనాకు వ్యతిరేకంగా ఈ రెండు దేశాలు ఓ రక్షణ ఒప్పందంపై సంతకం చేశాయి. చైనా దురాక్రమణ చర్యలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

New Update
Japan, Philippines seal defence pact amid rising China pressure

Japan, Philippines seal defence pact amid rising China pressure

భారత్‌ మిత్రదేశాలైన జపాన్, ఫిలిప్పీన్స్‌ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. చైనాకు వ్యతిరేకంగా ఈ రెండు దేశాలు ఓ రక్షణ ఒప్పందంపై సంతకం చేశాయి. చైనా దురాక్రమణ చర్యలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం ఈ రెండు దేశాలు పరస్పరం ఎలాంటి పన్ను లేకుండా మందుగుండు సామాగ్రి, ఇంధనం, ఆహారం, ఇతర సైనిక వనరులను రవాణా చేసుకుంటాయి. చైనాకు వ్యతిరేకంగా తీసుకున్న ఈ ఒప్పందం జపాన్, ఫిలిప్పీన్స్ మధ్య సహకారాన్ని బలోపేతం చేస్తోంది.    

ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం జపాన్‌, ఫిలిప్పీన్స్ రెండూ కూడా చైనాతో సముద్ర వివాదాల్లో చిక్కుకున్నాయి. జపాన్ వివాదం తూర్పు చైనా సముద్రంలో ఉండగా ఫిలిప్పీన్స్‌ది దక్షిణ చైనా సమద్రంలో కొనసాగుతోంది. ఈ విషయంలో చైనాకు సవాలు చేసేందుకే ఇరు దేశాలు ఒక్కటైనట్లు తెలుస్తోంది. మరోవైపు ఫిలిప్పీన్స్‌కు జపాన్ అదనపు భద్రత, ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించింది. ఇందులో రెస్క్యూ బోట్ల కోసం షెల్టర్ల నిర్మాణ, దక్షిణ ఫిలప్పీన్స్‌లోని పేదలు ఉండే ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించే ప్రణాళికలు ఉన్నాయి.    

Also Read: 4 ఏళ్లలో 3.3 లక్షల మంది దుర్మరణం..బైక్ ప్రమాదాల్లో చనిపోతున్న జనాలు

దక్షిణ చైనా సముద్రంలో చట్ట పాలన, నావిగేషన్, విమాన ప్రయాణ స్వేచ్ఛ కోసం ఇరు దేశాలు అంగీకరించినట్లు ఫిలిప్పీన్స్ విదేశాంగ కార్యదర్శి థెరిసా లాజారో వెల్లడించారు. తూర్పు, దక్షిణ చైనా సముద్రంలో బలవంతంగా పరిస్థితులు మార్చే ఏకపక్ష ప్రయత్నాన్ని జపాన్, ఫలిప్పీన్స్ వ్యతిరేకిస్తూనే ఉంటాయని జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మోటెగి స్పష్టం చేశారు. అయితే ఈ ఒప్పందం జపాన్‌ పార్లమెంట్‌లో ఆమోదం పొందిన తర్వాతే అమల్లోకి రానుంది. 2024లో కూడా జపాన్, ఫిలిప్పీన్స్‌ రెసిప్రొకల్ యాక్సెస్‌ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం ఇరుదేశాలు ఒకరి భూభాగంలో మరొకరు పెద్ద ఎత్తున సైనిక విన్యాసాలు, అలాగే లైవ్‌ ఫైర్‌ డ్రిల్‌లను నిర్వహించవచ్చు. 

Also Read: ఇజ్రాయెల్‌లో భారీ భూకంపం.. అణు పరీక్షలు చేసినట్లు ప్రచారం !

చైనా మాత్రం దక్షిణ చైనా సముద్రం మొత్తం తమదేనని చెబుతోంది. కృత్రిమ దీవులను నిర్మించి అక్కడ సైనిక స్థావరాలు కూడా ఏర్పాటుచేసింది. అయితే ఫిలిప్పీన్స్‌తో పాటు మలేషియా, వియత్నాం, బ్రూనై , తైవాన్‌కు కూడా ఈ ప్రాంతంలో హక్కులున్నాయి. మరోవైపు తూర్పు చైనా సముద్రంలోని దీవులపై చైనా, జపాన్ మధ్య వివాదం కొనసాగుతోంది. చైనా కోస్ట్‌గార్డ్, వైమానిక కార్యకలాపాలకు స్పందిస్తూ జపాన్ చాలాసార్లు తమ యుద్ధ విమానాలను ఆకాశంలో తిప్పాల్సిన పరిస్థితి వచ్చింది. 

Advertisment
తాజా కథనాలు