/rtv/media/media_files/2026/01/15/minister-ponguleti-srinivas-directs-on-medaram-festival-arrangements-2026-01-15-21-38-26.jpg)
Minister Ponguleti Srinivas Directs on Medaram festival arrangements
మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రాంగణాన్ని పచ్చదనంగా సుందరీకరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. జనవరి 18న సీఎం రేవంత్ అక్కడ పర్యటన చేయనున్నారని.. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. జాతర సమీపిస్తున్న నేపథ్యంలో పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు మంత్రి పొంగులేటి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆయనకు మంత్రులు సీతక్క, అడ్మూరి లక్ష్మణ్, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ ఘన స్వాగతం పలికారు.
Also Read: మేడారానికి పోటెత్తిన భక్తులు..వరుస సెలవుల నేపథ్యంలో..
అనంతరం మంత్రులు సమ్మక్క సారలమ్మ గద్దేల పునరుద్ధరణ పనులను పరిశీలించి వనదేవతలను దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని ల్యాండ్ స్కేపింగ్, ప్రధాన ద్వారం ఫ్లోరింగ్ పనులు పరిశీలించారు. కల్చర్ ప్రాంగణ స్థలాన్ని చూసి అధికారులకు పలు సూచనలు చేశారు. అలాగే ఆర్టీసీ బస్టాండ్, జంపన్న వాగు, స్తూపం రోడ్లను కూడా పరిశీలించారు. ఆ తర్వాత మంత్రులు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
Also Read: మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీదే గెలుపు.. ఎగ్జిట్ పోల్స్ విడుదల
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఆలయ ప్రాంగణాన్ని పచ్చదనంగా సుందరీకరించాలని, రహదారులపై ఉన్న మట్టి, ఇతర వ్యర్ధాలు వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. రహదారుల సెంట్రల్ లైటింగ్ డివైడర్ మధ్యలో సుందరీకరణ చెట్లను నాటాలని అలాగే అవసరం ఉన్న చోట కూలీల సంఖ్య పెంచుకొని పనులు జరిగేలా చూడాలన్నారు. పనుల విషయంలో అధికారులు, గుత్తేదారులు నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదంటూ హెచ్చరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలంటూ ఆదేశించారు. ఇదిలాఉండగా ఈ నెల 28వ తేదీ నుంచి మేడారంలోని సమ్మక్క - సారలమ్మ జాతర ప్రారంభం కానుంది.
Follow Us