/rtv/media/media_files/2026/01/16/rs-praveen-kumar-responds-on-resigning-from-brs-party-rumors-2026-01-16-15-36-04.jpg)
RS Praveen Kumar Responds on Resigning from BRS Party rumors
బీఆర్‌ఎస్ పార్టీకి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై తాజాగా ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను రాజీనామా చేయడం లేదని స్పష్టం చేస్తూ తాజాగా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. తెలంగాణ అన్ని వర్గాల భవిష్యత్తు BRS పార్టీతోనే భద్రంగా ఉంటుందని తెలిపారు. BRS అధికారంలో లేనప్పటికీ ఆ పార్టీలో చేరానని.. సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని ఆఫర్లు ఇచ్చినా నా నిర్ణయాన్ని మార్చుకోలేదని పేర్కొన్నారు.
KCR నాయకత్వంలో పోరాడి సాధించుకున్న తెలంగాణను దోపిడి కాంగ్రెస్ చెర నుంచి విముక్తి చేసే వరకు మడమ తిప్పనన్నారు.BRS పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని ప్రజలు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారని తెలిపారు. ఇప్పటికే తెలంగాణ చాలా నష్టపోయిందని.. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే తరాలు నాశనం అవుతాయన్నారు. నా మీద తప్పుడు ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవంటూ హెచ్చరించారు.
ఇదిలాఉండా ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. పార్టీ అధికారిక కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారని అందుకే రాజీనామా చేసే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో BSP తరపున సిర్పూర్ నుంచి ప్రవీణ్ కుమార్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో BRSకు రాజీనామా చేసిన కోనేరు కోనప్ప తిరిగి అదే పార్టీలో చేరారు. అయితే తాను సిర్పూర్ నుంచి పోటీ చేస్తానని ప్రవీణ్ కుమార్ చెబుతున్నారు. దీంతో సిర్పూర్ సీటుపై BRSలో ఉత్కంఠ కొనసాగుతుతోంది. ఎవరికి ఈ స్థానాన్ని హైకమాండ్ అప్పగిస్తుందనేది ఆసక్తి నెలకొంది. అయితే ప్రవీణ్ కుమార్‌ను అచ్చంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని బీఆర్‌ఎస్ సూచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
తెలంగాణ ప్రజలను పట్టపగలే మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు పెల్లుబుకుతున్న ప్రజాగ్రహం నుండి తప్పించుకోవడానికి యధావిధిగా మరో అటెన్షన్ డైవర్షన్ కుట్రకు తెరలేపింది.
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) January 16, 2026
నా మీద సామాజిక మాధ్యమాల్లో పార్టీ మారుతున్నాను అంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేయిస్తున్నట్లు నా దృష్టికి చాలా మంది… pic.twitter.com/ZUPG64B5Ig
Follow Us