Road Accident: పెళ్లికి వెళ్తుండగా ఘోర ప్రమాదం.. వరుడితో సహా 8 మంది మృతి
ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్తున్న కారులో వరుడి(24)తో సహా 8 మంది మృతి చెందడం కలకలం రేపింది. శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లికి వెళ్తున్న కారులో వరుడి(24)తో సహా 8 మంది మృతి చెందడం కలకలం రేపింది. శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
1 నుంచి 5వ తరగతి వరకు హిందీ భాషను తప్పనిసరిగా బోధించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేవా (MNS) అధినేత రాజ్ ఠాక్రే కలిసి నిరసన చేయనున్నారు.
ప్రతినెల షమి తన మాజీ భార్యకు రూ.4 లక్షల పరిహారం చెల్లించాలని ఇటీవలే కోర్టు ఆదేశించింది. దీంతో ఆమె అతడిపై తీవ్ర ఆరోపణలు చేశారు. షమికి అసలు క్యారెక్టరే లేదని.. గర్వంతో నన్ను, నా బిడ్డను మానసికంగా వేధింపులకు గురిచేశాడని మండిపడ్డారు.
హీరో సుహాస్, మాళవిక మనోజ్ జంటగా రామ్ గోదల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఓ భామ అయ్యో రామా’ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కామెడీ, ఎమోషనల్ సన్నివేశాలతో ట్రైలర్ అదిరిపోయింది. ఈ మూవీలో అనిత హస్సానందాని, అలీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం నంది నగర్ నివాసానికి చేరుకున్నారు. గురువారం ఆయన యశోద ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తన పంట పొలంలోకి దిగారు. అక్కడ కూలీలతో కలిసి వరినాట్లు వేశారు. అలాగే గొర్రు (జంబు) కూడా కొట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఎక్స్‌లో షేర్ చేసిన ఆయన.. తనకు పాత రోజుకు గుర్తుకొచ్చాయన్నారు.
ఇటీవల మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో 90 డిగ్రీల మలుపుతో నిర్మించిన రైల్వే బ్రిడ్జి వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతానికి సమీపంలోనే మరో తప్పిదం జరిగింది. పాములా మెలికలు తిరిగిన మరో రైల్వే వంతెనను నిర్మించారు. దీనిపై కూడా తీవ్రంగా విమర్శలొస్తున్నాయి.
అమెరికాలోని టెక్సాస్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే వరదలు పోటెత్తాయి. ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది బాలికలు గల్లంతయ్యారు. రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది వాళ్లకోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
పీపీపీ నేత బిలావల్ భుట్టో కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్‌కు కూడా మసూజ్ అజర్ ఎక్కడున్నాడనే విషయం తెలియదని తెలిపారు. ఒకవేళ అతడు పాక్‌లోనే ఉన్నట్లు భారత్ నిరూపిస్తే.. అతడిని మేము అరెస్టు చేయడాన్ని ఆనందంగా భావిస్తామని అన్నారు.