Jackky Bhagnani: దివాలా తీసిన రకుల్ భర్త.. అసలేం జరిగిందో చెప్పిన జాకీ

టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, దివాలా తీశారని వస్తున్న వార్తలపై ఆయన ఎట్టకేలకు స్పందించారు.

New Update
Rakul Husband Jackky Bhagnani

Rakul Husband Jackky Bhagnani

Jackky Bhagnani:  టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని, దివాలా తీశారని వస్తున్న వార్తలపై ఆయన ఎట్టకేలకు స్పందించారు. అయితేఇటీవలే  జాకీ నిర్మించిన  'బడే మియా చోటే మియా'  సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన ఫలితం సాదించలేకపోయింది. ఫ్లాప్ గా నిలిచింది! దీంతో జాకీ అప్పుల్లో కూరుకుపోయారని, దివాలా తీశారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనికోసం ఆయన తన జుహూ కార్యాలయాన్ని అమ్ముకున్నారని వార్తలు వచ్చాయి. 

Also Read:Oh Bhama Ayyo Rama: 'ఓ భామా అయ్యో రామా'.. స్టార్ డైరెక్టర్ల ఎంట్రీతో నవ్వులు పూయించిన ట్రైలర్!

నేను పట్టించుకోవడం లేదు

తాజాగా జాకీ ఈ వార్తలపై  స్పందించారు. సినిమా కోసం తాను తాకట్టు పెట్టిన జుహూ కార్యాలయాన్ని అమ్మలేదని, తిరిగి సొంతం చేసుకున్నానని స్పష్టం చేశారు.  ''నేను  దివాలా తీయడం వల్ల  ఆ కార్యాలయాన్ని అమ్ముకున్నానని, తినడానికి కూడా నాతో డబ్బు లేదని వార్తలు వచ్చాయి. అంతేకాదు నేను పారిపోయానని కూడా ప్రచారం జరిగింది. అసలు ఈ రూమర్స్ ఎక్కడ మొదలయ్యాయో కూడా నాకు తెలియడం లేదు! కానీ ఈ విషయంలో నేను ఎవరినీ నిందించాలని అనుకోవడం లేదని'' తెలిపారు. 

Also Read:Oh Bhama Ayyo Rama: 'ఓ భామా అయ్యో రామా'.. స్టార్ డైరెక్టర్ల ఎంట్రీతో నవ్వులు పూయించిన ట్రైలర్!

అలాగే తనకు వ్యతిరేకంగా వచ్చిన ఈ వార్తలు, తప్పుడు కథనాలు ఊహించినవేనని.. తాను వాటిని పట్టించుకోవడం లేదని క్లారిటీ ఇచ్చారు. అలీ అబ్బాస్ జాఫర్ వంటి దర్శకుడికి ఈ ప్రాజెక్ట్ అప్పగించడం కూడా సరిగ్గా వర్కౌట్ కాలేదన్నారు. ఏదేమైనా నష్టాన్ని అంగీకరించి, తన నిర్ణయాలకు బాధ్యత వహించి, ముందుకు వెళ్ళిపోతున్నానని అన్నారు. "బడే మియా చోటే మియా" సినిమా బడ్జెట్ దాదాపు ₹350 కోట్లు బడ్జెట్ తో నిర్మించగా..  రూ. 102 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

Also Read:Naga Chaitanya NC24: నాగచైతన్య 'NC24' సెకండ్ షెడ్యూల్ షురూ.. వైరలవుతున్న పోస్టర్!

Latest News | cinema-news

Advertisment
Advertisment
తాజా కథనాలు