BIG BREAKING: ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్.. వైద్యుల కీలక ప్రకటన!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం నంది నగర్ నివాసానికి చేరుకున్నారు. గురువారం ఆయన యశోద ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.

New Update
BRS KCR

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం నంది నగర్ నివాసానికి చేరుకున్నారు. గురువారం ఆయన యశోద ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిద వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయని.. సోడియం లెవల్స్ తక్కువగా ఉన్నాయని నిర్దారించారు. ఇందుకు సంబంధించిన చికిత్స అందించారు. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి మెరుగు పడడంతో ఆయనను ఈ రోజు డిశ్చార్జ్ చేసినట్లు యశోద ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

3న ఫామ్ హౌస్ నుంచి యశోద ఆస్పత్రికి..

ఈ నెల 3న ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ ను హైదరాబాద్ యశోద ఆస్పత్రికి తరలించారు. ఇది జరిగిన కొద్ది గంటలకే సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై వైద్య అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. దీంతో కేసీఆర్ కు అసలేమైందన్న చర్చ మొదలైంది. భారీగా బీఆర్ఎస్ శ్రేణులు ఆస్పత్రికి తరలిరావడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. 

అదే రోజు రాత్రి కేసీఆర్ ఆరోగ్యంపై యశోద ఆస్పత్రి హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. వీక్ నెస్ తో కేసీఆర్ అడ్మిట్ అయ్యారని.. షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉండడంతో పాటు, సోడియం లెవల్స్ అధికంగా ఉన్నట్లు పరీక్షల్లో తేలిందన్నారు. ఇందుకు సంబంధించిన చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం నిన్న సాయంత్రం కేసీఆర్ ఆస్పత్రిలోనే పార్టీ నేతలతో సమావేశమైన వీడియోలను బీఆర్ఎస్ విడుదల చేసింది. దీంతో ఆయన ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలకు బ్రేక్ పడింది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు