Shami: షమికి అసలు క్యారెక్టరే లేదు.. మాజీ భార్య తీవ్ర ఆరోపణలు

ప్రతినెల షమి తన మాజీ భార్యకు రూ.4 లక్షల పరిహారం చెల్లించాలని ఇటీవలే కోర్టు ఆదేశించింది. దీంతో ఆమె అతడిపై తీవ్ర ఆరోపణలు చేశారు. షమికి అసలు క్యారెక్టరే లేదని.. గర్వంతో నన్ను, నా బిడ్డను మానసికంగా వేధింపులకు గురిచేశాడని మండిపడ్డారు.

New Update
Mohammed Shami and Estranged Wife haseen jahan

Mohammed Shami and Estranged Wife haseen jahan

Shami:

టీమిండియా బౌలర్‌ మహ్మద్‌ షమి వ్యక్తిగత జీవితంపై వివాదం నడుస్తూనే ఉంది. ఇటీవలే ఆయనకు.. తన మాజీ భార్య హసీన్ జహాన్ నుంచి విడాకులకు సంబంధించిన కేసులో కోర్టు కీలక తీర్పునిచ్చింది. ప్రతినెల షమి తన మాజీ భార్యకు రూ.4 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ తీర్పు వచ్చిన వెంటనే జహాన్‌ సోషల్ మీడియాలో షమిపై సంచలన ఆరోపణలు చేశారు. షమి తన కుటుంబ బాధ్యతలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇతరులపై డబ్బులు ఖర్చు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు షమికీ క్యారెక్టరే లేదంటూ మండిపడ్డారు.  

Also Read: ఎవర్రా మీరంతా.. అప్పుడేమే 90 డిగ్రీల వంతెన.. ఇప్పుడు పాములా మెలికలు తిరిగేలా

ఇన్‌స్టాగ్రామ్‌లో హసీన్‌ దీనిపై పోస్ట్ చేశారు.'' అసలు షమికి క్యారెక్టర్ లేదు. గర్వంతో నన్ను, నా బిడ్డను మానసికంగా వేధింపులకు గురిచేశాడు. నన్ను భయపెట్టడం కోసం కొంతమంది క్రిమినల్స్‌కు కూడా డబ్బులిచ్చాడు. ఇప్పటికైనా నిజం బయటపడింది. కోర్టు తీర్పు వల్ల న్యాయ నాతోనే ఉందని'' రాసుకొచ్చారు. ఇదిలాఉండగా ఇప్పటికే షమిపై వివిధ కేసులు కూడా నమోదయ్యాయి. 

Also Read: పట్నాలో ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖెమ్కా హత్య..కారు దిగుతుండగానే కాల్పులు..

ఇదిలాఉండగా.. గతంలో షమీపై హసీన్ జహాన్ అనైతిక సంబంధాలు, మానసిక వేధింపులు గృహ హింస, ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 2018లో ఆమె వీటిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత షమి వ్యక్తిగత జీవితం వివాదంలో చిక్కుకుంది. పలువురు షమినీ వ్యతిరేకించగా.. మరికొందరు సమర్థించారు. మరోవైపు హసీన్ జహాన్, షమీ మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే తాజాగా కోర్టు తీర్పుతో ఆమెకు న్యాయం జరిగిందని నెటిజన్లు భావిస్తున్నారు. అయినప్పటికీ తాజాగా షమీకి క్యారెక్టర్ లేదంటూ ఆమె మరోసారి తీవ్ర ఆరోపణలు చేయడం గమనార్హం.  

Also Read: భారీ వరదలు.. 24 మంది మృతి, 25 మంది బాలికలు గల్లంతు

Advertisment
Advertisment
తాజా కథనాలు