Floods: భారీ వరదలు.. 24 మంది మృతి, 25 మంది బాలికలు గల్లంతు

అమెరికాలోని టెక్సాస్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే వరదలు పోటెత్తాయి. ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది బాలికలు గల్లంతయ్యారు. రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది వాళ్లకోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

New Update
Texas floods death toll rises to 24, with up to 25 children missing

Texas floods death toll rises to 24, with up to 25 children missing

Floods:

అమెరికాలోని టెక్సాస్‌(Texas, USA)లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే వరదలు పోటెత్తాయి. ఈ ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది బాలికలు గల్లంతయ్యారు. రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది వాళ్లకోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. భారీ వర్షాల వల్ల హంట్ ప్రాంతంలో గ్వాడలుపే అనే నది ఉప్పొంగుతుంది. దీని ప్రభావం వల్ల చాలావరకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. అనేక నివాసాలు జలమయమయ్యాయి. వీధుల్లోకి భారీగా వరద నీరు చేరాయి. 

Also Read:Boney Kapoor Daughter: పెళ్లి పీటలేక్కబోతున్న బోనీ కపూర్ కూతురు.. ఎంగేజ్మెంట్ ఫొటోలు వైరల్!

Also Read: ప్రయాణీకులకు గుడ్‌ న్యూస్‌.. ఆ రూట్లో వందేభారత్‌కు మరో 4 కోచ్‌లు

ఈ వరదల్లో ఇప్పటిదాకా 24 మంది మృతి చెందగా.. 200 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. వాస్తవానికి గ్వాడులుపే నదీ తీరంలోని ప్రముఖ క్రిస్టియన్ క్యాంప్‌లో వేసవి శిక్షణాశిబిరం నిర్వహిస్తున్నారు. ఈ ప్రదేశాన్ని కూడా వరదలు ముంచెత్తాయి. దీంతో 25 మంది బాలికలు గల్లంతయ్యారాని అధికారులు తెలిపారు. వాళ్ల ఆచూకి కోసం రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా గాలిస్తున్నారు. పడవలు, హెలికాప్టర్ల సాయంతో గాలిస్తున్నారు.  

Also Read: ఉక్రెయిన్‌పై యుద్దం ఆపేది లేదు : పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్

ఇదిలాఉండగా భారత్‌లోని హిమాచల్ ప్రదేశ్‌లో కూడా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భారీగా ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగింది.  దీంతో ప్రజల రోజువారీ జీవితం అస్తవ్యస్తంగా మారింది. కొండచరియలు విరిగిపడటం వల్ల ఇప్పటిదాకా 65 మందికి పైగా మరణించినట్లు సీఎం సుఖ్‌వీందర్ సింగ్ తెలిపారు. మరో 37 మంది గల్లంతయ్యారని, 110 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు