Uttarakhand: వరినాట్లు వేసి, గొర్రు కొట్టిన సీఎం.. ఫొటోలు వైరల్

ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి తన పంట పొలంలోకి దిగారు. అక్కడ కూలీలతో కలిసి వరినాట్లు వేశారు. అలాగే గొర్రు (జంబు) కూడా కొట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఎక్స్‌లో షేర్ చేసిన ఆయన.. తనకు పాత రోజుకు గుర్తుకొచ్చాయన్నారు.

New Update
ttarakhand Chief Minister Pushkar singh Dhami  Plants Paddy, Says "Remembered Old Days"

ttarakhand Chief Minister Pushkar singh Dhami Plants Paddy, Says "Remembered Old Days"

Uttarakhand:

ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి నాగ్లా తరై గ్రామంలో తన పంట పొలంలోకి దిగారు. అక్కడ కూలీలతో కలిసి వరినాట్లు వేశారు. అలాగే గొర్రు (జంబు) కూడా కొట్టారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఆయన ఎక్స్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరలవుతున్నాయి. సీఎంను ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. '' వ్యవసాయం క్షేత్రంలో పనిచేయడం ద్వారా పాత రోజులు గుర్తుకువచ్చాయి. రైతుల కృషి, త్యాగం, అంకితభావాన్ని అర్థం చేసుకున్నాను.

Also read: ఎవర్రా మీరంతా.. అప్పుడేమే 90 డిగ్రీల వంతెన.. ఇప్పుడు పాములా మెలికలు తిరిగేలా

 రైతులు మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక మాత్రమే కాదు. రాబోయే తరాలకు మన సంస్కృతిని అందించే వారధులు'' అంటూ రాసుకొచ్చారు. హుడ్కియా బాల్‌ అనే అక్కడి సంప్రదయాన్ని పాటిస్తూ.. దీనిలో భాగంగా సీఎం పుష్కర్ సింగ్ దామి భూమీ, నీరు, మేఘాలకు పూజలు చేశారు.  

Also Read: పట్నాలో ప్రముఖ వ్యాపారవేత్త గోపాల్ ఖెమ్కా హత్య..కారు దిగుతుండగానే కాల్పులు..

Advertisment
Advertisment
తాజా కథనాలు