Bhopal Railway Overbridge: ఎవర్రా మీరంతా.. అప్పుడేమో 90 డిగ్రీల వంతెన.. ఇప్పుడు పాములా మెలికలు తిరిగేలా

ఇటీవల మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో 90 డిగ్రీల మలుపుతో నిర్మించిన రైల్వే బ్రిడ్జి వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ ప్రాంతానికి సమీపంలోనే మరో తప్పిదం జరిగింది. పాములా మెలికలు తిరిగిన మరో రైల్వే వంతెనను నిర్మించారు. దీనిపై కూడా తీవ్రంగా విమర్శలొస్తున్నాయి.

New Update
After the 90-degree flyover, now 'snake-like' bridge under scrutiny in Bhopal

After the 90-degree flyover, now 'snake-like' bridge under scrutiny in Bhopal

Bhopal Railway Overbridge:

ఇటీవల మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో 90 డిగ్రీల మలుపుతో నిర్మించిన రైల్వే బ్రిడ్జి తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీనికి డిజైన్‌ రూపొందించి, నిర్మించిన పలువురు ఇంజినీర్లను సస్పెండ్ కూడా చేశారు. అయితే తాజాగా మధ్యప్రదేశ్‌లో మళ్లీ అలాంటి తప్పదమే జరిగింది. 90 డిగ్రీల వంతెనకు సమీపంలోనే సుభాష్‌నగర్‌లో పాములా మెలికలు తిరిగిన మరో రైల్వే వంతెనను నిర్మించారు. ఈ నిర్మాణంలో ఇంజినీర్ల నిర్లక్ష్యం వల్ల ఎనిమిది గంటల్లోనే రెండు ప్రమాదాలు జరిగాయాని వాహనాదారుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: ప్రయాణీకులకు గుడ్‌ న్యూస్‌.. ఆ రూట్లో వందేభారత్‌కు మరో 4 కోచ్‌లు

రూ.40 కోట్లతో ఈ వంతెనను నిర్మించినట్లు తెలుస్తోంది. భోపాల్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లాలంటే ఈ బ్రిడ్జి మీదుగానే ప్రయాణికులు వెళ్లాలి. దీనివల్ల సుభాష్‌ నగర్‌లో వాహనాల రద్దీ తగ్గినప్పటికీ ఆ బ్రిడ్జి మెలికలు తిరిగి ఉండటంతో సెకన్ల వ్యవధిలో పలుమార్లు మలుపులు తీసుకోవాల్సి వస్తోందని స్థానికులు విరుచుకుపడుతున్నారు. రాత్రి సమయాల్లో వాహనాదారులు మలుపుల వద్ద కంట్రోల్‌ తప్పి ప్రమాదాలకు గురవుతున్నారని ధ్వజమెత్తుతున్నారు.  

ఇటీవలే ఆ వంతెనపై ఓ కారు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి గాల్లో పల్టీలు కొట్టిందని తెలిపారు. మరోసారి ఓ స్కూల్‌ వ్యాన్ కూడా డివైడర్‌ను ఢీకొనడంతో విద్యార్థులకు గాయాలయ్యాయని పేర్కొన్నారు. మళ్లీ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, వంతెనకి మరమ్మతులు చేయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

Also Read: సంచలన నిర్ణయం.. పక్కింటి వాళ్లు పర్మిషన్ ఇస్తేనే కుక్కను పెంచుకోవాలి

 ఇక భోపాల్‌లోని ఐష్‌బాగ్‌ వద్ద రూ.18 కోట్లతో 90 డిగ్రీల మలుపు ఉన్న బ్రిడ్జిని నిర్మించడంతో తీవ్రంగా విమర్శలు వచ్చాయి. నిర్మాణ సంస్థ మాత్రం ఆ రైల్వే బ్రిడ్జి డిజైన్‌ను సమర్థించుకుంది. దగ్గర్లో మెట్రో రైల్‌ స్టేషన్, భూమి కొరత ఉందని.. ఇలా నిర్మించడం తప్ప మరో మార్గం లేదని చెప్పింది.  కొంచెం అదనపు భూమి అందుబాటులో ఉండి ఉంటే ఆ రూట్ సవ్యంగా ఉండేదని పేర్కొంది. కానీ దీన్ని తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఏడుగురు ఇంజినీర్లను సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకుంది.

Also Read: రోటీని నెయ్యితో తినే విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారంటే!

Advertisment
Advertisment
తాజా కథనాలు