Vishwak Sen: హీరో విశ్వక్ ఇంట్లో చోరీ కేసులో దొంగలు అరెస్ట్..
హీరో విశ్వక్ సేన్ ఇంట్లో దొంగతనం చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. షేక్ పేట నాలా వద్ద దొంగిలించిన డైమండ్ రింగ్స్, ఇతర వస్తువులను విక్రయిస్తుండగా పట్టుబడ్డారు. భీమవరపు స్వరాజ్, బొల్లి కార్తీక్, నేరేడుమల్లి సందీప్ లను నిందితులుగా గుర్తించారు.