/rtv/media/media_files/2025/11/14/tamannaah-2025-11-14-13-31-13.jpg)
Tamannaah
Tamannaah:మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల తన కెరీర్‌లో మళ్లీ మంచి జోష్‌ను అందుకుంది. రెండు సంవత్సరాల పాటు నటుడు విజయ్ వర్మతో సాగిన ప్రేమ కథ ముగిసిన తర్వాత తన పనిమీద, శరీరంపై మరింత దృష్టి పెట్టినట్లు చెప్పింది. బ్రేకప్ తర్వాత ఆమె చేసిన మార్పులు ఇప్పుడు ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
తమన్నా ఒక ఇంటర్వ్యూలో తన వెయిట్ లాస్(Weight Loss) గురించి వచ్చిన రూమర్లకు క్లారిటీ ఇచ్చింది. కొంతమంది ఆమె మందులు, ప్రత్యేక ఇంజెక్షన్స్ ఉపయోగించి సడన్‌గా సన్నబడిందని ప్రచారం చేయగా, దీనిపై ఆమె స్పందిస్తూ-
“నేను కెమెరా ముందే పెరిగాను. 15 ఏళ్ల వయసు నుంచే నటనలో ఉన్నాను. నా లుక్‌లో వచ్చిన చిన్న మార్పులు ప్రేక్షకులు కూడా గమనిస్తారు. దాచాల్సిందేం లేదు. కోవిడ్ తర్వాత కొంచెం శారీరకంగా తగ్గినా, మళ్లీ ఫిట్‌గా ఉండేందుకు సాధారణ వర్కౌట్స్, డైట్ ఫాలో అయ్యాను. మహిళల్లో 5 ఏళ్లకొకసారి మార్పులు సహజమే” అని స్పష్టం చేసింది.
Also Read : మేఘ శుక్లా ఎద అందాల విందు.. నెట్టింట వైరలవుతున్న ఫొటోలు!
Tamannaah Says She Will Focus On Her Physique
విజయ్ వర్మతో బ్రేకప్ తర్వాత తమన్నా కెరీర్ మళ్లీ స్పీడ్ చేసింది. వరుసగా పలు భాషల్లో సినిమాలు, స్పెషల్ సాంగ్స్ చేస్తూ బిజీగా ఉంది. హిందీలో రోమియా, రేంజర్, వివాన్, రాగిణీ MMS 3 వంటి ప్రాజెక్ట్స్‌తో పాటు, తమిళంలో విశాల్- సుందర్ సి సినిమా చేయనుంది.
తెలుగులో ఓదెల తర్వాత పెద్దగా కనిపించని ఆమె, ఇప్పుడు శంకర్ వర ప్రసాద్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనుందని టాక్ నడుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా, ఇండస్ట్రీలో మాత్రం ఇది పెద్ద చర్చగా మారింది. ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన F2, F3 చిత్రాల్లో హీరోయిన్‌గా, సరిలేరు నీకెవ్వరూ సినిమాలో స్పెషల్ సాంగ్‌తో మెప్పించిన సంగతి తెలిసిందే. అదే బాండింగ్‌తో ఇప్పుడు చిరంజీవి సినిమాలో కూడా తమన్నాను అనిల్ అప్రోచ్ చేశారని టాక్ వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా… తమన్నా సన్నబడిన కొత్త లుక్‌పై ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఆమె ఫిట్‌గా మారడమే కాకుండా, వరుస ప్రాజెక్ట్స్‌ను చేపట్టడం చూసి “తమన్నా మళ్లీ ఫుల్ ఫారంలోకి వచ్చింది” అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి, బ్రేకప్ తమన్నాకు బ్రేక్ కాదు… కొత్త స్టార్ట్‌ను ఇచ్చింది. ప్రస్తుతం ఆమె కెరీర్ మళ్లీ పీక్‌లోకి వెళ్లడం చూసి అభిమానులు ఖుషీగా ఉన్నారు.
Also Read : చున్నీ తీసేస్తే 'ఉమెన్ ఎంపవర్మెంటా?'.. "ది గర్ల్ ఫ్రెండ్" సినిమాపై నెటిజన్స్ ఫైర్!
Follow Us