SIVA: రీరిలీజ్ కు సిద్ధమైన వర్మ కల్ట్ క్లాసిక్ శివ..పవంబర్ 14న థియేటర్లలో..

కింగ్ నాగార్జున, రామ్ గోపాల వర్మ కలయికలో రూపొందిన కల్ట్ క్లాసిక్ శివ సినిమా రీ రిలీజ్ కు సిద్ధమైంది. అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు 4కె డాల్బీ ఆట్మాస్‌ వెర్షన్‌లో ఈనెల 14న తిరిగి ప్రేక్షకుల ముందుకు రానుంది.

New Update
Siva

తెలుగు సినిమా అంటే శివకు ముందు ఆ తరువాత అని చెబుతారు. దర్శకుడు రామ్ గోపాల వర్మ తెలుగే కాదు, మొత్తం ఇండియన్ సినిమా దారినే మార్చేశారు శివతో. 1989లో వచ్చిన ఈ మూవీ ఘ విజయాన్ని సొంతం చేసుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్‌ నిర్మించిన శివ ఇప్పుడు 4కె డాల్బీఆట్మాస్‌ వెర్షన్‌లో ఈనెల 14న తిరిగి ప్రేక్షకుల ముందుకు రానుంది. నిన్న హైదరాబాద్ లో ఈ సినిమా రీరిలీజ్ట్రైలర్(Siva Re Release Trailer) ను విడుదల చేశారు.

Also Read :  హాట్ ఫోజుల్లో నేహా శెట్టి.. ఫొటోలు చూస్తే కుర్రాళ్లు ప్లాట్

రీరిలీజ్ ట్రైలర్ విడుదల..

దీని తరువాత హీరో నాగార్జున(nagarjuna) మాట్లాడుతూ 36ఏళ్ల క్రితం దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ నాతో ఈ ‘శివ’ తీసి.. నన్ను పెద్ద స్టార్‌ను చేశారు. తాజాగా ఈ సినిమా మళ్లీ చూశా. అద్భుతంగా అనిపించింది అని చెప్పారు. రామ్ గోపాల్ వర్మ ఆరు నెలలు కష్టపడి ప్రతి సౌండ్‌ ట్రాక్‌ని మళ్లీ ఒరిజినల్‌ సినిమా చేసినట్లుగా అద్భుతంగా డిజైన్‌ చేశాడని..డాల్బీఅట్మాస్ లో అదిరిపోతుందని నాగార్జున అన్నారు. 36ఏళ్ళ క్రితం తీసిన సినిమా ఇది..ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఇలా ఒకే వేదికపై నిలబడి రీ రిలీజ్‌ ట్రైలర్‌ విడుదల చేస్తూ మాట్లాడతామని నేనెప్పుడూ ఊహించలేదని దర్శకుడు రామ్ గోపాల వర్మ అన్నారు.

Also Read: Ghazala Hashmi: వర్జీనియా కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ గా హైదారబాదీ గజాలా హష్మీ

Advertisment
తాజా కథనాలు