/rtv/media/media_files/2025/11/06/jana-nayagan-2025-11-06-17-45-46.jpg)
jana nayagan
Jana Nayagan: కోలీవుడ్(kollywood news) స్టార్ హీరో దళపతి విజయ్(Vijay Dalapathy) ప్రస్తుతం తన చివరి ప్రాజెక్ట్ 'జన నాయగన్' సినిమాతో బిజీగా ఉన్నారు. హెచ్. వినోద్ దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ అడ్వెంచర్ గా రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే కొంత కాలంగా ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ఈ క్రమంలో ఎదురుచూపులకు చెక్ పెడుతూ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
Let's Begin 🔥🔥🔥#Thalapathy@actorvijay sir #HVinoth@hegdepooja@anirudhofficial@thedeol@_mamithabaiju@Jagadishbliss@LohithNK01@RamVJ2412@TSeries#JanaNayagan#JanaNayaganPongal#JanaNayaganFromJan9pic.twitter.com/4VlEonM0Q9
— KVN Productions (@KvnProductions) November 6, 2025
Also Read : సోషల్ మీడియా ట్రోలర్స్ కి సింగర్ చిన్మయి బిగ్ షాక్ !
ఇక మొదలెడదామా
'లెట్స్ బిగిన్' అంటూ దళపతి విజయ్ కొత్త పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ లో విజయ్ చుట్టూ భారీగా జనం గుమిగూడి ఉన్నారు. ప్రజలు నుంచి ఆయనకు ఫుల్ సపోర్ట్ లభిస్తున్నట్లుగా చూపించారు. చూస్తుంటే ఇది సినిమా సాంగ్ లోని ఓ సన్నివేశం అని తెలుస్తోంది. "లెట్స్ బిగిన్" అనే క్యాప్షన్... సినిమా ప్రమోషన్లు అధికారికంగా ప్రారంభమైనట్లు సూచిస్తున్నాయి. అంటే త్వరలోనే మూవీ ఫస్ట్ సింగిల్ లేదా టీజర్ విడుదల చేయనున్నట్లు హింట్ ఇచ్చారు. పోస్టర్ విజయ్ మాస్ అండ్ రస్టిక్ లుక్ లో కనిపిస్తూ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని పెంచారు.
Also Read: Santhana Prapthirasthu: రొమాన్స్, ఎమోషన్.. అదరగొడుతున్న 'సంతాన ప్రాప్తిరస్తూ' ట్రైలర్!
Follow Us