Singer: 3,800 మందికి పైగా గుండె ఆపరేషన్లు.. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో సింగర్ కి చోటు!

ప్రముఖ బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్ కి అరుదైన గౌరవం దక్కింది.  తన సంగీతం ద్వారా సంపాదించిన డబ్బుతో 3,800 మందికి పైగా నిరుపేద పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించి.. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది.

New Update
Singer Palak Muchhal

Singer Palak Muchhal

Singer Palak Muchhal: ప్రముఖ బాలీవుడ్ సింగర్ పాలక్ ముచ్చల్ కి అరుదైన గౌరవం దక్కింది.  తన సంగీతం ద్వారా సంపాదించిన డబ్బుతో 3,800 మందికి పైగా నిరుపేద పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించి.. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది.  ఆమె స్థాపించిన 'పాలక్ పలాష్ ఛారిటబుల్ ఫౌండేషన్' ద్వారా, దేశవ్యాప్తంగా,  అంతర్జాతీయంగా 3,800 కంటే ఎక్కువ మంది పేద పిల్లలకు గుండె  ఆపరేషన్ల కోసం ఆర్ధిక సహాయం అందించారు. ఆమె చేసిన అసాధారణమైన  మానవతా సేవకు గానూ గిన్నిస్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం దక్కింది. 

Also Read :  SSMB29: గ్లోబ్‌ట్రాటర్ బిగ్ రివీల్.. 130 అడుగుల స్క్రీన్, 50,000 మంది ఫ్యాన్స్!

డబ్బంతా సేవ కోసమే..

పాలక్  లో చిన్న వయసు నుంచే సేవా దృక్పథం మొదలైంది. చిన్నప్పుడు ఆమె రైలు ప్రయాణం చేస్తుండగా, కొంతమంది పేద పిల్లలను చూసి చలించిపోయారు. అప్పుడే పాలక్ తనలో ఒక ప్రతిజ్ఞ చేసుకున్నారట.. తాను ఏదో ఒకరోజు వారికి తప్పకుండా సహాయం సహాయపడాలని నిర్ణయించుకుంది. ఆ ఆలోచనే  ఆమె  'పాలక్ పలాష్ ఛారిటబుల్ ఫౌండేషన్' కి నాందిగా మారింది. తాను సంగీత ప్రయాణం మొదలు పెట్టినప్పటి నుంచి.. ప్రతీ కచేరీ ఆదాయం, పర్సనల్ సేవింగ్స్ అన్నింటినీ వైద్య సేవలకు అందిస్తున్నారు. ఇండోర్ మధ్య ప్రదేశ్ కి చెందిన పాలక్  'మేరీ ఆషీకి', 'కౌన్ తుఝే' వంటి ఎన్నో చార్ట్‌బస్టర్ హిట్‌లను అందించారు.

ఇతర సేవలు

గతంలో పాలక్ కార్గిల్ అమరవీరుల కుటుంబాలకు కూడా చేయూతను అందించారు.   అలాగే, గుజరాత్‌లో సంభవించిన భూకంప బాధితులకు రూ. 10 లక్షలు విరాళంగా అందించారు. ఇది  సామాజిక సంక్షేమం పట్ల ఆమెకున్న నిబద్దత ఎంత లోతైనది అనే విషయాన్ని తెలియజేస్తోంది. 

Also Read: Andhra King Taluka: హీరో రామ్ ఊరమాస్ స్టెప్పులు.. 'ఆంధ్రా కింగ్ ' తాలూకా సాంగ్ వచ్చేసింది!

Advertisment
తాజా కథనాలు