SSMB29: గ్లోబ్‌ట్రాటర్ బిగ్ రివీల్.. 130 అడుగుల స్క్రీన్, 50,000 మంది ఫ్యాన్స్!

స్తుతం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం  SSMB 29. ఈనెల 15న ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ రివీల్ చేయబోతున్నారు మేకర్స్.  

New Update
Mahesh Babu went to Odisha state for SSMB29 movie shooting

SSMB29: ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం  SSMB29. ఈనెల 15న ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ రివీల్ చేయబోతున్నారు మేకర్స్.  దీని కోసం ''ది గ్రాండ్ గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్"(Mahesh Babu Globe Trotter)  హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో అనే పేరుతో భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఇందులో మూవీ టైటిల్ లేదా టీజర్ రివీల్ చేయనున్నట్లు తెలుస్తోంది.   ఇండియన్ సినిమా చరిత్రలోనే అతి పెద్ద ఈవెంట్ గా దీనిని ప్లాన్ చేస్తున్నారు దర్శకుడు రాజమౌళి.  

Also Read :  ఉఫ్.. టూ పీస్ బికినీలో హీరోయిన్ బోల్డ్ ఫొటో షూట్! ఈ పిక్స్ చూస్తే అంతే

ఈవెంట్ ప్రత్యేకతలు 

నవంబర్ 14న జరగబోయే ఈ బిగ్ రివీల్ ఈవెంట్ కి  సుమారు 50,000 మంది అభిమానులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.  టీజర్ ప్రదర్శన కోసం  భారతదేశంలోనే అతి పెద్దదైన 130 అడుగుల వెడల్పు, 100 అడుగుల ఎత్తు ఉన్న భారీ స్క్రీన్‌ను ఏర్పాటు చేస్తున్నారట. దీనిపైనే SSMB29 టైటిల్ టీజర్  మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శితమవుతోంది.  ఈ బిగ్ ఈవెంట్ ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జియో హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ చేయనున్నారు.

హీరో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీ రాజ్ సుకుమారన్, రాజమౌళి ఇతర చిత్రబృందం ఈ వేడుకలో పాల్గొని సందడి చేయనున్నారు. ఈవెంట్ లో శృతి హాసన్  లైవ్ పర్ఫార్మెన్స్ కూడా ఉండబోతుంది.  కీరవాణి సంగీతంలో ఇటీవలే విడుదలైన   'సంచారి సంచారి' పాటను శృతి హాసన్, ర్యాపర్ డివైన్ కలిసి లైవ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు.  అడ్వెంచర్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు ఒక అన్వేషకుడి (Globe Totter) పాత్రలో కనిపించబోతున్నారు. 

Also Read: Rajamouli vs Telugu Media: 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్‌పై వివాదం! తెలుగు మీడియా కెమెరాలకు నో ఎంట్రీ!

Advertisment
తాజా కథనాలు