Drugs: తెలంగాణలో రూ.12 వేల కోట్ల డ్రగ్స్ స్వాధీనం
హైదరాబాద్‌లోని చర్లపల్లి పరిశ్రమల ప్రాంతంలో ఓ రసాయన ఫ్యాక్టరీ కేంద్రంగా ఎండీ (మెఫెడ్రోన్) అనే డ్రగ్‌ను ఉత్పత్తి చేస్తున్న ముఠాను ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఏకంగా రూ.12 వేల కోట్ల విలువైన నిషేధిత మాదకద్రవ్యాలను పట్టుకున్నారు.