/rtv/media/media_files/2026/01/02/cm-revanth-2026-01-02-13-36-05.jpg)
CM Revanth
అధికారంలోకి వస్తే మూసీని ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల దీనికి సంబంధించి ప్రణాళికలు కూడా చేశామని రేవంత్ సర్కార్ తెలిపింది. అయితే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు మొదలవ్వడంతో మూసీ నది ప్రక్షాళనపై తాజాగా సీఎం రేవంత్ మాట్లాడారు. నిజాం కాలంలో నిర్మించిన ప్రాజెక్టులే ఇప్పుడు హైదరబాద్ ప్రజల దాహాన్ని తీరుస్తున్నాయని అన్నారు. గతంలో మన జలవనరులను కాపాడుకునే ప్రయత్నాలు కూడా జరగలేదని విమర్శలు చేశారు. ''గతంలో జల వనరులను కలుషితం చేసి భూ కబ్జాలతో ఫాంహౌస్‌లు కట్టుకున్నారు. వాటికి సంబంధించిన డ్రైనేజీలను జంట జలాశయాలకు కలిపేశారు.
మేము అధికారంలోకి వచ్చాక నిందితులపై కఠినంగా చర్యలు తీసుకున్నాం. డ్రైనేజీలను కూలగొట్టాం. కాకతీయుల నుంచి నిజాం వరకు నది పరివాహక ప్రాంతంలోనే ప్రాజెక్టులు నిర్మించారు. వరదల నుంచి హైదరాబాద్‌ను రక్షించేందుకు 1922 నాటికి హిమాయత్ సాగర్, ఉస్మాన్‌సాగర్ ప్రాజెక్టులను నిర్మించారు. వాళ్లు చేసిన అభివృద్ధిని గత పాలకులు కనుమరుగు చేశారు. నదులను కలుషితం చేశారు. మురుగు కాల్వలను మూసీలో కలిపేశారు. ఇలా చేయడం వల్ల నల్గొండ జిల్లాలోని మూసీ పరివాహక ప్రజలు జీవించలేని పరిస్థితి ఉంది.
Also Read: సీఎం సంచలనం.. KCR, హరీశ్ రావు సంతకాలే తెలంగాణాకు మరణశాసనం
అందుకే మేము మూసీ సుందరీకరణపై అధ్యయనం చేశాం. ఏడాది మొత్తం మూసీలో నీల్లు ప్రవహించేలా ప్లాన్ చేశాం. మూసీ ప్రక్షాళన కోసం గ్లోబల్ టెండర్లు కూడా పిలిచాం. మూడూ కంపెనీలు జాయింట్ వెంచర్ కింద పునరుద్ధరణ పనులు ప్రారంభించాయి. గోదావరి నుంచి 20 TMCల నీరు హైదరాబాద్‌కు మళ్లించాలనే ప్లాన్ ఉంది. ప్రజల తాగునీటి కోసం 15 TMCలు, గండిపేటకు మరో 5 TMCలు తరలించేలా చూస్తున్నాం.
ఇప్పటికే లండన్, దక్షిణ కొరియా, జర్మనీ, జపాన్, సింగపూర్ నదీ పరివాహక ప్రాంతాల్లో సుందరీకరణను పరిశీలించాం. ప్రపంచస్థాయి నగరాలు నదీ పరివాహక ప్రాంతాలను కాపాడుకున్నాయి. వాటిని వ్యాపార కేంద్రాలుగా మార్చేశాయి. దీనివల్ల ఆర్థికవ్యవస్థ బలోపేతానికి ఆయా దేశాలు కృషి చేస్తున్నాయి. గుజరాత్‌లో ఉన్న సబర్మతి నదిని అభివృద్ధి చేసేందుకు 60 వేల కుటుంబాలను వేరే ప్రాంతానికి తరలించారు. ఉత్తరప్రదేశ్‌లో గంగా నదిని ప్రక్షాళన చేసి రివర్‌ఫ్రంట్‌ను ఏర్పాటు చేశారు. ఆయా రాష్ట్రాల్లో కూడా నదులను ప్రక్షాళన చేయడాన్ని ఎవరూ వ్యతిరేకించడం లేదు.
Also Read: సిగరెట్, పాన్ మసాలాపై 40 శాతం జీఎస్టీ.. ఎప్పటినుంచంటే ?
మూసీ పరివాహకంలో గురుద్వార్,మసీదు, చర్చిలను నిర్మించి మత సామరస్యాన్ని చాటుతాం. డీపీఆర్ సిద్దమయ్యాక అందరి సలహాలు, సూచనలు తీసుకుంటాం. గాంధీ సరోవర్ నిర్మాణానికి డిఫెన్స్ ల్యాండ్ ఇచ్చేందుకు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ అంగీకరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలకు నా సూచన ఏంటంటే మీ నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి కావాలో చెప్పండి. పేదలకు మంచి ఇళ్లు కట్టించి మెరుగైన వసతులు కల్పిద్దాం. హైదరాబాద్ ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలనేదే మా సంకల్పం. డీపీఆర్ సిద్దమయ్యాక ఎమ్మెల్యేలందరికీ కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి వారి సలహాలు తీసుకుంటామని'' సీఎం రేవంత్ వివరించారు.
LIVE: Seventh Session of Telangana Legislative Assembly Day - 02 https://t.co/sKxsDq2lf0
— Revanth Reddy (@revanth_anumula) January 2, 2026
Follow Us