/rtv/media/media_files/2025/12/29/swasa-2025-12-29-19-00-18.jpg)
అలర్జీ అనే సమస్యపై ప్రజల్లో, వైద్య విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు శ్వాస హాస్పిటల్, శ్వాస ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఒక ప్రత్యేక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఫౌండర్ చైర్మన్ డా. విష్ణున్ రావు వీరపనేని నేతృత్వంలో "శ్వాస ఐడియాస్" (SWASA IDIAS - Interdisciplinary Interactive Allergy Solutions) లోగోను ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా డా. విష్ణున్ రావు మాట్లాడుతూ.. అలర్జీ అనేది కేవలం తుమ్ములు, దగ్గు లేదా దురదలకే పరిమితం కాదని, ఇది ముక్కు, ఊపిరితిత్తులు, చర్మం, కడుపు, నరాలు ఇలా శరీరంలో ఏ భాగానికైనా సోకవచ్చని వివరించారు. తన 30 ఏళ్ల అనుభవంతో ఆయన ఒక కీలక విషయాన్ని చెప్పారు. "చాలామంది డాక్టర్లను, హాస్పిటల్స్‌ను మారుస్తుంటారు కానీ ఫలితం ఉండదు. ఎందుకంటే సమస్య వేరులో ఉంటే మనం ఆకులకు వైద్యం చేస్తున్నాం. 'ట్రీట్ ది రూట్.. నాట్ ది ఫ్రూట్' అనే నినాదంతో అలర్జీ మూల కారణాన్ని గుర్తించి వైద్యం చేయడమే తమ శ్వాస ఐడియాస్ ముఖ్య ఉద్దేశ్యం" అని ఆయన తెలిపారు. ఈ విషయాన్ని శ్వాస ఫౌండేషన్ ద్వారా అలర్జీ ఆస్తమా బాధితులకి, వారి కుటుంబాలకి, ప్రజలకి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
శిరీష రాఘవేంద్ర ముఖ్య అతిథిగా
ఈ కార్యక్రమానికి ఐపీఎస్ అధికారిణి శిరీష రాఘవేంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెతో పాటు తెలంగాణ రాష్ట్ర పీడియాట్రిక్ విభాగం అధ్యక్షుడు డా. గడగోజు భాస్కర్, నీలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ డా. జి. విజయకుమార్ ఇతర ప్రముఖ వైద్యులు ప్రొఫెసర్ డా. రమేష్, డా. నిర్మల, డా. శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. యువ డాక్టర్లు ఈ సరికొత్త వైద్య విధానంపై అవగాహన పెంచుకోవాలని వారు సూచించారు.
శ్వాస హాస్పిటల్ డైరెక్టర్, చీఫ్ పల్మనాలజిస్ట్ డా. వివేక్ వర్ధన్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అలర్జీ, ఆస్తమా బాధితులకే కాకుండా, ప్రాక్టీసింగ్ యంగ్ డాక్టర్లకు ఈ శ్వాస ఐడియాస్ ఒక గొప్ప వేదికగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఆపరేషన్స్ హెడ్ సంతోష్, సత్యనారాయణ ఇతర సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Follow Us