Cyclone Montha: వాయుగుండంగా బలహీనపడిన మొంథా తుపాను.. తెలంగాణలో భారీ వర్షాలు !

మొంథా తుపాను వాయుగుడంగా బలహీనపడ్డట్లు వాతావరణ శాఖ తెలిపింది. గడిచిన ఆరు గంటలకు ఇది కేవలం 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతం దీని ప్రభావం తెలంగాణలో కొనసాగుతోంది.

New Update
Cyclone Montha weakens into deep depression

Cyclone Montha weakens into deep depression

మొంథా తుపాను వాయుగుడంగా బలహీనపడ్డట్లు వాతావరణ శాఖ తెలిపింది. గడిచిన ఆరు గంటలకు ఇది కేవలం 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ప్రస్తుతం దీని ప్రభావం తెలంగాణలో కొనసాగుతోంది. భద్రచలానికి 50 కిలోమీటర్ల, ఖమ్మం జిల్లాకు 110 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమైంది. అలాగే ఒడిశాలోని మల్కన్‌గిరికి 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఉత్తర వాయవ్య దిశగా కదలుతూ మరింత బలహీనపడనుంది. దీని ప్రభావం వల్ల రాగాల 12 గంటల్లో తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లో భారీ వర్షాలు పడనున్నాయి. 

Also Read: మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్.. లొంగిపోయిన 51 మంది మావోలు

అంతేకాదు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరద వచ్చే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వివిధ ప్రాంతాల్లో గాలులు గంటకు 35-45 కిలోమీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉందని పేర్కొంది. యాదాద్రి భువనగిరి, కరీంనగర్‌, సిరిసిల్ల,హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆ జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ఇక జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి,  ఆదిలాబాద్, నిర్మల్, సూర్యాపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి. 

Also Read: ఒక్కో కుటుంబానికి రూ.3 వేలు సాయం.. తుఫాన్ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ శుభవార్త!

Advertisment
తాజా కథనాలు