BIG BREAKING : రాజ్ భవన్లో మంత్రిగా అజారుద్దీన్‌ ప్రమాణం

తెలంగాణ మంత్రిగా కాంగ్రెస్ నేత అజారుద్దీన్‌ రాజ్ భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు.  ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటుగా పలువురు మంత్రులు పాల్గొన్నారు.

New Update
Mohammed Azharuddin

తెలంగాణ మంత్రిగా కాంగ్రెస్ నేత అజారుద్దీన్‌ రాజ్ భవన్లో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఆయనతో ప్రమాణం చేయించారు.  ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటుగా పలువురు మంత్రులు పాల్గొన్నారు. ప్రస్తుతం రేవంత్ కేబినేట్ లో ఇంకా రెండు మంత్రి పదువులు ఖాళీగా ఉన్నాయి.  ఇందులో ఓసీ, బీసీలకు చోటు  దక్కే అవకాశం ఉంది. ఇక అజారుద్దీన్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నియమించారు. గవర్నర్ ఆమోదించాల్సి ఉంది. 

ప్రస్తుతానికి అజారుద్దీన్‌కు ఏ శాఖ కేటాయిస్తారనే దానిపై అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, మైనార్టీ సంక్షేమం, క్రీడలు లేదా హోం శాఖ వంటి కీలక శాఖల్లో ఏదో ఒకటి దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 

బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు

రాష్ట్ర కేబినెట్‌లో మైనారిటీ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో, మైనారిటీ ఓట్లను ఆకర్షించే  వ్యూహంలో భాగంగానే ఈ హడావుడి మంత్రివర్గ విస్తరణ జరిపించారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.  జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ ఈ మంత్రివర్గ విస్తరణ చేపట్టడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందని ఆరోపిస్తూ బీజేపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు.

Advertisment
తాజా కథనాలు