Bandi Sanjay: బండి సంజయ్ నోట.. మోదీ పాట.. వీడియో వైరల్!
ఎప్పుడూ సీరియస్ గా కనిపించే బీజేపీ నేత బండి సంజయ్.. సింగర్ గా మారారు. నమో.. నమో.. నరేంద్ర మోదీ.. అంటూ పాట పాడారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
ఎప్పుడూ సీరియస్ గా కనిపించే బీజేపీ నేత బండి సంజయ్.. సింగర్ గా మారారు. నమో.. నమో.. నరేంద్ర మోదీ.. అంటూ పాట పాడారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన స్టేట్ మెంట్ ఇచ్చారు. తెలంగాణలో హిందూవులు సేఫ్గా ఉండాలంటే.. బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. బీజేపీ గవర్నమెంట్ రావాలంటే పాత సామానంతా బీజేపీ నుంచి బయటికి వెళ్లిపోవాలంటూ కీలక కామెంట్స్ చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తెలంగాణ బీజేపీ కీలక నేత, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఈ రోజు కుటుంబ సమేతంగా కలిశారు. ఈటల మనవడికి ప్రధాని స్వయంగా చాక్ లెట్స్ అందించారు. తెలంగాణ అధ్యక్ష పదవి ఫిక్స్ అయిందని.. అందుకే ప్రధానిని ఈటల కలిశారన్న ప్రచారం సాగుతోంది.
ఢిల్లీ ఎన్నికల్లో విజయంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ నాయకత్వం ఇప్పుడు తెలంగాణపై ఫోకస్ పెట్టింది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నాయకులు తెలంగాణపై దృష్టి సారించారు.రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బలమైన బీసీనేతకు పగ్గాలు అప్పగించాలని భావిస్తోంది.
తెలంగాణ బీజేపీ నేతలతో పీఎం మోదీ ఈ రోజు భేటీ అయ్యారు. సీఎం రేవంత్ పాలన ఎలా ఉంది? కేంద్ర పథకాలు ఎలా అమలు అవుతున్నాయి?.. తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలిసికట్టుగా పని చేయాలని.. రాష్ట్రంలో భవిష్యత్ బీజేపీదేనని దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు . నీ బతుకెంతా.. ప్రధాని మోదీపై విమర్శలు చేయడం ఏంటని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే ఫార్మా సిటీని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు హామీలను నెరవేర్చడం లేదన్నారు.
ఇకపై చిల్లర రాజకీయం చేయనని.. నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకుంటానని బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ప్రకటన చేశారు. ధర్మ కార్యక్రమాలు నిర్వహిస్తానన్నారు.
అమృత్ స్కీమ్ టెండర్లలో అవకతవకలు జరిగాయంటూ ఫిర్యాదు చేసేందుకు కేటీఆర్ ఢిల్లీ టూర్ పై తెలంగాణ బీజేపీ నేతలు సైలెంట్ గా ఉండడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఫిర్యాదుకు కేంద్రం ఎలా రెస్పాండ్ అవుతుందనే అంశం హాట్ టాపిక్ గా మారింది.