/rtv/media/media_files/2025/02/03/GaoJwl8ruDqNU0NVlJfA.jpg)
BJP
BJP Targets : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలని బీజేపీ(telangana-bjp) ప్రయత్నాలు మొదలు పెట్టింది. రాష్ట్రంలో బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో ఆయా స్థానాల్లో తమ పట్టు నిలుపుకోవాలని పార్టీ భావిస్తోంది. దీనిపై టీ బీజేపీ హై కమాండ్ ఫుల్ ఫోకస్ పెట్టింది. గతంలో కంటే అత్యధిక స్థానాలు గెలిచి సత్తాచాటాలనే వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఆ లెక్కన కొన్ని మున్సిపాల్టీలు, నగర పాలక సంస్థల్లో పాగా వేయాలనే ప్లాన్‌లో ఉంది. కాంగ్రెస్ గెలిచిన మున్సిపాల్టీల్లో బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, మల్కాజిగిరి,రంగారెడ్డి, మెదక్ తదితర జిల్లా్ల్లో పాగవేయాలని బీజేపీ ప్లాన్‌చేస్తోంది. ఈ నియోజకవర్గా్ల్లో పార్టీ ఎంపీలు ఉండటంతో ఎలాగైన ఆయా స్థానాల్లో మేయర్, చైర్మన్ స్థానాలను గెలిచితీరాలని ప్రయత్నిస్తోంది. వీలయినన్ని మున్నిపాలిటీల్లో ఎక్కువ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోంది. నిజామాబాద్ కార్పొరేషన్‌ను ఎలాగైనా సాధించాలని ఎంపీ అర్వింద్(bjp-mp-arvind) తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని పార్టీ నేతలతో పలుమార్లు సమావేశమయ్యారు. నిజామాబాద్ మేయర్ స్థానాన్ని సాధించడం కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇక కేంద్రమంత్రి బండి సంజయ్(bandi-sajnay-kumar) ప్రాతినిథ్యం వహిస్తున్న కరీనగర్ లోక్ సభ పరిధిలో ఉన్న మున్సిపాటీలను గెలిచి జాతీయ నాయకులకు కానుకగా ఇవ్వాలని ఆయన మాస్టర్ ప్లా్‌న్ వేస్తున్నారు. దీనికోసం కరీంనగర్ పురపాలికపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఇక మెదక్ ఎంపీగా ఉన్న రఘునందన్ రావు ఈ ఎన్నికల్లో తన సత్తా చాటాలని ప్రయత్ని్స్తున్నారు. ఆయన ఇప్పటికే మెదక్ జిల్లా వ్యాప్తంగా ఒక రౌండ్ చుట్టి వచ్చారు. మరోవైపు పెద్దగా పార్టీ క్యాడర్ లేకపోయినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటిన డీ.కే,అరుణ(bjp mp dk aruna) సైతం తన పరిధిలో ఉన్న మున్సిపాలిటీలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆయా మున్సిపాలిటీల్లో అత్యధిక సీట్లు సాధించడం ద్వారా మరోసారి తన సత్తా చాటాలని ఆమె ప్రచారం ముమ్మరం చేశారు. ఇక మల్కాజిగిరి పార్లమెంట్ స్థానంలో విజయం సాధించిన ఈటల రాజేందర్(eetala-rajendar) తన పరిధిలో ఉన్న పురపాలికలపై కన్ను వేశారు. ఇప్పటికే ఆయన జిల్లాస్థాయి నాయకుల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపు నిచ్చారు. అటు ఆదిలాబాద్ ఎంపీ నగేష్, ఇటు చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డిలు సైతం తమ నియోజకవర్గంలో ఉన్న మున్సిపాలిటీల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు.
Also Read : అజిత్ పవార్ అంత్యక్రియల్లో బరితెగించిన దొంగలు..ఏడుగురు అరెస్ట్!
ఎమ్మెల్యేలు ఉన్న చోట..
రాష్ట్రంలో ఎంపీలతో పాటు బీజేపీకి 8మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలున్నచోట వీలయినన్ని ఎక్కువ చైర్మన్, మేయర్ స్థానాలను కైవసం చేసుకోవాలని, పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లను గెలిపించుకుని అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలనే లక్ష్యంతో బీజేపీ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాష్ర్టంలో బీఆర్‌ఎస్‌కు ప్రజలు దూరం అయ్యారని భావిస్తున్న బీజేపీ స్థానిక సంస్థల్లో బీఆర్‌ఎస్ కు ప్రత్యామ్నయంగా ఎదగడం ద్వారా రానున్న ఎన్నికలకు బాటలు వేసుకోవాలని భావిస్తోంది. దీనికోసం పార్టీ నాయకులంతా ఒకే తాటిపై పనిచేయాలని ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో అధ్యక్షుడు రాంచందర్‌రావు(telangana bjp chief ramachandra rao) నాయకులకు దిశానిర్ధేశం చేశారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుత ఎన్నికల్లో బలమైన పార్టీగా ఎదిగితే రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి రాష్ర్టంలో బీజేపీనే ప్రధాన పార్టీగా ఎదిగే అవకాశం ఉంటుందని బీజేపీ నాయకులు భావిస్తున్నారు. దీనికోసం పార్టీ అగ్రనాయకులు వ్యూహాలు రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.
Also Read : యూట్యూబర్‌కు కట్నంగా రూ. 71 లక్షల నగదు, 21 తులాల బంగారం..వీడియో వైరల్..
Follow Us