/rtv/media/media_files/2025/11/14/fotojet-95-2025-11-14-20-16-15.jpg)
Telangana Politics: జూబ్లీహిల్స్ ఎన్నికలు(by election in jubilee hills 2025) కొత్త రాజకీయ చర్చకు దారి తీస్తున్నాయి. ఈ ఎన్నికలు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీల మధ్యే ప్రధానంగా జరిగినప్పటికీ మరో జాతీయ పార్టీ బీజేపీ కూడా తన సత్తా చాటుకునేందుకు పోటీ చేసి డిపాజిట్ కోల్పోయింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక అంశం చర్చకు వస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల నాటికి టీపీసీసీకి అధ్యక్షుడిగా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు. అయితే ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించిన పార్టీగా నిలబెట్టడంతో రేవంత్ రెడ్డి విజయం సాధించడంతో ఆయనకు ముఖ్యమంత్రి పదవి దక్కడంతో టీపీసీసీ నుంచి తప్పుకున్నాడు. దీంతో ఆ అవకాశం ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్ గౌడ్(TPCC Chief Mahesh Kumar Goud)ను వరించింది. దీంతో కొత్త టీపీసీసీ చీఫ్ గా ఆయన బాధ్యతలు తీసుకున్నారు.
అదే సమయంలో పార్లమెంట్ ఎన్నికల నాటికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి వ్యవహరించారు. అయితే ఆయనకు కేంద్ర మంత్రి వర్గంలో చోటు కలిపించడంతో ఆయన కూడా బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవలసి వచ్చింది. దీంతో పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు(Telangana BJP President Ramchander Rao)కు ఆ అవకాశం దక్కింది. దీంతో ఆయన బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు అయ్యారు. అంటే ఒకరకంగా రెండు ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ఒకే సమయంలో నూతన రాష్ర్ట అధ్యక్షులుగా వీరిద్దరూ నియమితులయ్యారు. వీరి నియమకం తర్వాత వచ్చిన ప్రధాన ఎన్నిక జూబ్లీహిల్స్ ఎన్నిక. ఈ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల అధ్యక్షులుగా వారి పాత్రపై ప్రస్తుతం చర్చ సాగుతోంది.
Also Read : రేవంత్ టీంలో జూబ్లీహిల్స్ జోష్.. నెక్ట్స్ టార్గెట్ అదే?
Mahesh Goud Hit - Ramchandra Rao Flop
అందరికంటే ముందుగా బీఆర్‌ఎస్ అభ్యర్థిని ప్రకటించగానే కాంగ్రెస్ అప్రమత్తమైంది. పోటీని తట్టుకుని నిలబడగలిగే నేత కోసం అన్వేషించింది. అజారుద్దీన్, బొంతు రామ్మోహన్, అంజనీకుమార్ యాదవ్, నవీన్ కుమార్ యాదవ్ తదితరులు పోటీపడినప్పటికీ స్థానికుడైన నవీన్‌కు టికెట్ కన్‌ఫం చేయడంలో రాష్ర్ట పార్టీ బాధ్యుడిగా మహేష్ గౌడ్ పాత్ర ఉంటుందనేది అందరికీ తెలిసిందే. బీసీ అభ్యర్థికి టికెట్‌ఇస్తే గెలిచే అవకాశాలు ఉంటాయని భావించడంతో పాటు స్థానికంగా నవీన్‌కు ఉన్న ఇమేజ్ ను కూడా గుర్తించడంలో పార్టీ సక్సెస్ అయ్యింది. అదే సమయంలో మైనారీటీలను సంతృప్తి పరచడం కోసం అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ ఇవ్వడంతో పాటు మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా సక్సెస్ అయ్యారు. ఇక ఎన్నికల ప్రచారం విషయంలోనూ మహేష్ కుమార్ గౌడ్ అత్యంత వ్యూహత్మకంగా వ్యవహరించారు. నియోజక వర్గానికి ముగ్గురు మంత్రులను ఇన్‌చార్జ్‌లుగా పెట్టి ఎప్పటికపుడు వారితో సమన్వయం చేయడం పార్టీకి కలిసివచ్చింది. మరోవైపు మిగిలిన మంత్రులను, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ క్యాడర్‌ను ఆయా ప్రాంతాల్లో మోహరించి తక్కువ సమయంలోనే నియోజకవర్గంపై మహేష్ గౌడ్ పట్టు సాధించారు. దానితో నవీన్‌కుమార్ విజయం నల్లేరుమీద నడక అయ్యిందనేది వాస్తవం. ఇదే జోష్ కొనసాగిస్తే వచ్చే స్థానిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల విజయం కూడా పెద్ద కష్టమేంకాదన్న చర్చ సాగుతోంది.
జూబ్లీహిల్స్ ఎన్నికను కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కానీ, అదే సమయంలో బీజేపీ మాత్రం తేలికగా తీసుకుందనే అభిప్రాయం ఉంది. కనీసం అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలోనూ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న రాంచందర్ రావు కేంద్ర నాయకత్వంతో సమన్వయం చేయలేకపోయారన్న అపవాదు ఉంది. మిగిలిన పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్న సమయంలోనూ ఆయన పెద్దగా స్పందించలేదు.అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఎన్నికల ప్రచారానికి ఎలాంటి వ్యూహం లేకుండానే బరిలోకి దిగడం తొలి ఫెయిల్యూర్ అని చెప్పవచ్చు. పార్టీకి రాష్ట్రంలో ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు, 8మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు ఉన్నప్పటికీ వారిని సమన్వయం చేయడంలోనూ వారిని నియోజకవర్గంలో మొహరించడంలోనూ రాంచందర్‌రావు పూర్తిగా విఫలమయ్యారన్న టాక్ వినపడుతోంది.
కనీసం స్థానిక నాయకులను కూడా పార్టీ ప్రచారానికి సరైన రీతిలో వినియోగించుకోలేదన్న అపవాదు ఉంది. అంతేకాక ఎన్నికల ప్రసంగాల్లోనూ అంత ఊపు లేకపోవడం, ఆకట్టుకునే వాగ్ధాటి ఉన్న నాయకులు లేకపోవడం , ఉన్న ఒకరిద్దరూ నాయకులను సరిగా వినియోగించుకోకపోవడంతో ఉప ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది. బీజేపీలో ప్రస్తుతం గెలిచినవారంతా వారి వారి వ్యక్తిగత ఇమేజ్ మీదే గెలిచారనే ప్రచారంఉంది. దీంతో వారు పార్టీకి అంతగా విధేయులుగా వ్యవహరించలేకపోతున్నారనే ప్రచారం ఉంది. క్రమశిక్షణ గల పార్టీగా చెప్పుకునే బీజేపీ పార్టీ రాష్ర్ట అధ్యక్షుడిగా ఆయా నాయకులను సమన్వయం చేసుకోవడంలో మాత్రం విఫలమయ్యారనే విమర్శలు ఉండనే ఉన్నాయి. ఇప్పటికైన ఆయా నాయకులను సమన్వయం చేసుకోక పోతే రాంచందర్‌రావుకు కష్టాలు తప్పవన్న విమర్శలు ఉన్నాయి.
Also Read : కిషన్ రెడ్డి పద్ధతి మార్చుకో.. KTR అహంకారం తగ్గించుకో.. సీఎం రేవంత్ వార్నింగ్!
Follow Us