Raja Singh : గువ్వల పని అయిపోయినట్టేనా? .. ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన కామెంట్స్!

బీజేపీపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మరోసారి  హాట్ కామెంట్స్ చేశారు.  బీజేపీలో కొత్తగా చేరాలనుకునేవారికి రాజాసింగ్  కొన్ని సలహాలు ఇచ్చారు. పార్టీలో చేరే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.

New Update
mla guvvala

బీజేపీపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌(Raja Singh) మరోసారి  హాట్ కామెంట్స్ చేశారు.  బీజేపీ(BJP) లో కొత్తగా చేరాలనుకునేవారికి రాజాసింగ్  కొన్ని సలహాలు ఇచ్చారు. పార్టీలో చేరే ముందు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలని ఆయన అన్నారు.  బీజేపీలో చేరేవారు ముందుగా ఒక్కసారి ఆలోచించుకోవాలని, ఒకసారి పార్టీలోకి వచ్చాక కార్యకర్తలకు మీరేం పదవులు ఇప్పించుకోలేరని చెప్పారు. ఈ మేరరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. పార్టీలో చేరేవారికి టికెట్‌ గ్యారంటీ కూడా ఉండదన్నారు. బీజేపీలో  చేరే ముందు తన  మాటలు గుర్తుపెట్టుకోండి.. రాసి పెట్టుకోండి అంటూ రాజాసింగ్ వ్యాఖ్యానించారు. బీజేపీలో చేరిన తర్వాత మీరు కోరుకున్నది జరగదన్న రాజాసింగ్..  పార్టీలో చేరిన రోజు ఫస్ట్ సీట్లో, తర్వాత లాస్ట్ సీట్లో ఉంటారని చెప్పారు.  

Also Read :  ఖమ్మంకు ఓ న్యాయం.. నల్లగొండకో న్యాయమా?: మంత్రి పదవిపై మరోసారి భగ్గుమన్న కోమటిరెడ్డి!

చాలామంది వేరే పార్టీ నుంచి

విజయశాంతి, జితేందర్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి లాంటి చాలామంది వేరే పార్టీ నుంచి బీజేపీలో చేరిన తర్వాత ఏమైందని ఆయన ప్రశ్నించారు. పార్టీని విడిచి ఎందుకు వెళ్లిపోయారో వాళ్లతో ఒక్కసారి మాట్లాడుకోండంటూ సజెషన్ ఇచ్చారు రాజాసింగ్. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇటీవల అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు(Guvvala Balaraju) బీజేపీలో చేరిన నేపథ్యంలో రాజాసింగ్ చేసిన ఈ కామెంట్స్ ప్రాధాన్యతను సంతరించుకుంది.  కాగా 2025జూన్ లో రాజాసింగ్ బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయగా..  ఆయన రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించింది.   ప్రస్తుతానికి ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు.  బీజేపీ అధిష్టానం తనను సంప్రదిస్తుందని, ఆ తర్వాతే తన భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకుంటానని ఆయన తెలిపారు. అయితే, ఆయన హిందుత్వ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.

Also Read :  సీబీఐకి గట్టు వామన్‌ రావు కేసు .. సుప్రీం కీలక ఆదేశాలు

మూడు సార్లు ఎమ్మెల్యేగా

ఎమ్మెల్యే రాజాసింగ్ తన రాజకీయ జీవితాన్ని TDPతో ప్రారంభించారు. 2009లో మంగళ్‌హాట్ డివిజన్ నుంచి జీహెచ్ఎంసీ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.  2014లో బీజేపీలో చేరి, గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2018, 2023 ఎన్నికలలో వరుసగా మూడు సార్లు గోషామహల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆయనే కావడం విశేషం.  

telangana-bjp | telugu-news | latest-telugu-news | telangana-politics | latest telangana news

Advertisment
తాజా కథనాలు