Taliban: మహిళా జర్నలిస్టులను ఆహ్వానించిన అఫ్గాన్ మంత్రి..
అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తాఖీ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఆయన ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించగా.. మహిళా జర్నలిస్టులను అనుమతించలేదు. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్‌కు మహిళా జర్నలిస్టులను ఆహ్వానించారు.