Pak Vs Ind: పాక్ బలుపు మాటలు.. భారత్‌తో యుద్ధానికి సై అన్న డిఫెన్స్ మినిస్టర్

పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము భారత్, అఫ్గానిస్థాన్‌తో యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు.

New Update
Ready for 2-front war with India, Afghanistan, Says Pak minister's latest bluster

Ready for 2-front war with India, Afghanistan, Says Pak minister's latest bluster

పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము భారత్(pak vs ind), అఫ్గానిస్థాన్‌తో యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తాజాగా ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 12 మంది మృతి చెందగా.. 36 మంది గాయాలపాలయ్యారు. ఈ దాడి తామే చేశామని తెహ్రికీ-ఈ తాలిబాన్ పాకిస్థాన్ (TTP) ప్రకటించింది. ఈ ఘటన తర్వాత పాక్ డిఫెన్స్‌ మినిస్టర్‌ భారత్‌, అఫ్గాన్‌తో యుద్ధానికి సిద్ధమనే వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Also Read: ఢిల్లీ పేలుడులో మరో ట్విస్ట్.. తప్పిపోయిన బ్రెజా కారు లభ్యం..

Pak vs Ind-Afghan

మరోవైపు భారత్‌ సపోర్ట్‌తోనే ఇస్లామాబాద్‌లో ఈ దాడి జరిగిందని పాక్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆరోపిస్తున్నారు. ఖవాజా ఆసీఫ్‌ కూడా తాలిబన్లు ఈ బాంబు దాడి చేసి సందేశం పంపారని అన్నారు. ''కాబుల్ పాలకులు పాకిస్థాన్‌లో ఉగ్రవాదాన్ని ఆపగలరు. కానీ ఇస్లామాబాద్‌కు యుద్ధాన్ని తీసుకురావడం అనేది కాబుల్‌ నుంచి వచ్చిన సందేశమే. దీనికి దేవుని ఆగ్రహం మేరకు ప్రతిస్పందించేందుకు పాకిస్థాన్‌కు పూర్తి సామార్థ్యం ఉందని'' ఆసిఫ్‌ ఎక్స్‌లో రాసుకొచ్చారు. 

Also Read: అధికారికంగా అమెరికా ప్రభుత్వ షట్ డౌన్ ముగింపు...బిల్లుపై ట్రంప్ సంతకం

Advertisment
తాజా కథనాలు