Afghanistan: భారత్ లో తాలిబాన్ విదేశాంగమంత్రి పర్యటన..ఇదే మొదటసారి

ఆఫ్గానిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ త్వరలో భారత్ లో పర్యటించనున్నారు. ఈ నెల రెండో వారం లో ఆయన ఢిల్లీకి వస్తారని తెలుస్తోంది. ఆఫ్గాన్ ను తాలిబన్లు చేజిక్కించుకున్నతర్వాత అక్కడి నాకత్వం పర్యటించడం ఇదే మొదటిసారి. 

New Update
muttaqi

ఆఫ్గానిస్తాన్ లో అమెరికా తన బలగాలను ఉపసంహరించుకున్న తర్వాత అక్కడ తాలిబాన్లు పాలనను మొదలుపెట్టాయి. అయితే ప్రపంచం దాన్ని ఒక దేశంగా మాత్రం గుర్తించడం లేదు. దానికి తోడు వారిపై అనేక ఆంక్షలు కూడా ఉన్నాయి. అక్కడి నాయకత్వానికి విదేశీ ప్రయాణాలపై కూడా ఆంక్షలు ఉన్నాయి. ఒకవేళ వారు ఎక్కడికైనా పర్యటించాలంటే దానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదం తెలపాలి. 

తాలిబాన్ నాయకత్వం పర్యటించడం ఇదే మొదటిసారి..

ఇన్నాళ్ళకు అఫ్గాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ త్వరలో ఇండియాకు రానున్నారు. ఈ నెల రెండో వారంలో ఆయన ఇక్కడకు వస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ముత్తాఖీకు ఐరాస భద్రతా మండలి నుంచి ఆమోదం లభించింది. తాలిబన్లు అఫ్గాన్‌ను చేజిక్కించుకున్న తర్వాత అక్కడి నాయకత్వం భారత్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. దీంతో ముత్తాకి పర్యటన ఒక కీలకమైన దౌత్యపరమైన చర్యగా అభివర్ణిస్తున్నారు. తాలిబాన్ విదేశాంగ మంత్రి నిజానికి లాస్ట్మంత్ లోనే భారత్ కు రావాలనుకున్నారు. కానీ అప్పుడు ఆయనకు పర్మిషన్ లభించలేదు. భారత్‌ పర్యటనకు మినహాయింపు ఇవ్వాలని ఆంక్షల కమిటీని ముత్తాఖీ కోరినప్పటికీ.. ఆ కమిటీకి అధ్యక్షత వహిస్తున్న పాకిస్థాన్‌ అందుకు అభ్యంతరం చెప్పారని తెలుస్తోంది. దీంతో అప్పుడు ముత్తాఖీ పర్యటన రద్దయింది. కానీ ఇప్పుడు ఐరాస మండలి మళ్ళీ ఆమోదం తెలపడంతో భారత్ పర్యటనకు మార్గం సుగమం అయింది.

దౌత్య కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయి.. 

 భారత్ నిజానికి తాలిబాన్ పాలనను అధికారికంగా గుర్తించనప్పటికీ, సంబంధాలను కొనసాగిస్తూనే ఉంది. వారితో దౌత్య కార్యకలాపాలు నిర్వర్తిస్తోంది. ఆఫ్ఘన్ ప్రజలకు మానవతా సాయం అందించడం కొనసాగిస్తోంది.ఈ ఏడాది మే నెలలో అఫ్గాన్ మంత్రితో భారత విదేశాంగ మంత్రి ఎస్‌ జైశంకర్‌ ఫోన్‌లో మాట్లాడారు. అలాగే పహల్గాం దాడిని తాలిబాన్లు ఖండించారు. లాస్ట్ ఇయర్ విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్త్రీ దుబాయ్ పర్యటనలో తాలిబాన్ విదేశాంగ మంత్రి మత్తాఖీని కలిశారు.

Also Read:  Foreign Students: విదేశీ విద్యార్థులపై మరో బాంబ్..ప్రవేశాలపై వైట్ హౌస్ కీలక ఆదేశాలు

Advertisment
తాజా కథనాలు