Taliban: మహిళా జర్నలిస్టులను ఆహ్వానించిన అఫ్గాన్‌ మంత్రి..

అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి అమిర్‌ ఖాన్ ముత్తాఖీ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఆయన ఢిల్లీలో ప్రెస్‌ మీట్ నిర్వహించగా.. మహిళా జర్నలిస్టులను అనుమతించలేదు. తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్‌కు మహిళా జర్నలిస్టులను ఆహ్వానించారు.

New Update
Taliban minister at press meet redo with women journalists

Taliban minister at press meet redo with women journalists

అఫ్గానిస్థాన్ విదేశాంగ మంత్రి అమిర్‌ ఖాన్ ముత్తాఖీ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల శుక్రవారం ఆయన ఢిల్లీలో ప్రెస్‌ మీట్(press-meet) నిర్వహించగా.. మహిళా జర్నలిస్టులను అనుమతించలేదు. దీంతో ఆయనపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశానికి మహిళా జర్నలిస్టులను ఆహ్వానించారు. 

Also Read: మెడికల్ స్టూడెంట్ పై అత్యాచారం.. సీఎం సంచలన కామెంట్స్

Taliban Minister Amir Khan Muttaqi Press Meet

ఇక వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం ఢిల్లీలోని అఫ్గానిస్థాన్‌ దౌత్యకార్యాలయంలో ముత్తాఖీ ప్రెస్ మీట్ నిర్వహించారు. కానీ ఇందులో ఒక్కరు కూడా మహిళ కనిపించలేదు. దీంతో ఆయన మహిళా జర్నలిస్టులను అడ్డుకున్నట్లు ప్రచారం నడిచింది. దీనిపై కొందరు మహిళా జర్నలిస్టులు కూడా సోషల్ మీడియాలో ముత్తాఖీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వివాదం చెలరేగడంతో చివరికి తాలిబన్ అధికారి దీనిపై స్పందించారు. మీడియా సమావేశంలో తాము ఉద్దేశపూర్వకంగా మహిళలను మినహాయించలేదని స్పష్టం చేశారు. 

Also Read: రాహుల్ గాంధీకి పట్టిన గతే తేజస్వీకి పడుతుంది.. ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు

మహిళలపై తమకు ఎలాంటి వివక్ష లేదని పేర్కొన్నారు. పాస్‌ల సంఖ్య తక్కువగా ఉందని.. అందుకే కొందరిని ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. మరోవైపు ఈ వ్యవహారంలో తమ ప్రమేయం కూడా ఏమీ లేదని కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ఇదిలాఉండగా అఫ్గానిస్థాన్‌లో మహిళలపై కఠినంగా ఆంక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మీడియా సమావేశంలో ఆయన మహిళలకు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఇక్కడ కూడా ఆయన వివక్ష చూపించారంటూ పలువురు మహిళా జర్నలిస్టులు తీవ్రంగా మండిపడ్డారు. చివరికి ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ముత్తాఖీ వారిని ఆహ్వానించారు. 

Also read: పరువు పోయిందిగా.. పాక్ సైనికులను పరిగెతిస్తున్న అఫ్గాన్ దళాలు.. వీడియోలు వైరల్!

Advertisment
తాజా కథనాలు