Taliban Warns Pakistan: పాకిస్తాన్‌తో తాలిబన్లు యుద్ధానికి సిద్ధం

అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడానికి టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరిగిన కీలక శాంతి చర్చలు మరోసారి విఫలమయ్యాయి. దీంతో తాలిబాన్ తాత్కాలిక ప్రభుత్వం పాకిస్తాన్‌కు యుద్ధ హెచ్చరికలు జారీ చేసింది.

New Update
taliban

Taliban Warns Pakistan: అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించడానికి టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరిగిన కీలక శాంతి చర్చలు మరోసారి విఫలమయ్యాయి. సరిహద్దు దాడులు, తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP) ఉగ్రవాదుల అంశంలో ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో, తాలిబాన్ తాత్కాలిక ప్రభుత్వం పాకిస్తాన్‌కు తీవ్ర యుద్ధ హెచ్చరికలు జారీ చేసింది. ఖతార్, టర్కీ దేశాల మధ్యవర్తిత్వంలో ఇస్తాంబుల్‌లో జరిగిన చర్చల్లో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్, తాలిబాన్ ప్రతినిధి బృందం పాల్గొన్నారు. చర్చల సందర్భంగా పాకిస్తాన్ కొన్ని "అసాధారణమైన, ఆమోదయోగ్యంకాని డిమాండ్లు" చేసిందని అఫ్గాన్ ప్రతినిధులు ఆరోపించారు. 

Also Read: 'కే ర్యాంప్' ఎంటర్టైన్మెంట్..! ఇప్పుడు ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే...?

Also Read: 'SSMB 29' ఈవెంట్ కు భారీ సెటప్‌.. స్టేజ్ ఎంత పెద్దదో తెలిస్తే..!

పాకిస్తాన్‌పై దాడులు చేస్తున్న TTP ఉగ్రవాదులను అఫ్గాన్ భూభాగం నుంచి పూర్తిగా తొలగించాలి.
తమ భూభాగంపై డ్రోన్ దాడులు జరిపేందుకు ఒక విదేశీ దేశంతో చేసుకున్న ఒప్పందాన్ని పాకిస్తాన్ సమర్థించుకోవడం.
ఈ డిమాండ్లను తాలిబాన్ ప్రభుత్వం "పాకిస్తాన్ అంతర్గత సమస్యగా" కొట్టిపారేసింది. తమ దేశంపై భవిష్యత్తులో జరిగే ఏ సైనిక దాడినైనా దీటుగా ఎదుర్కొంటామని తాలిబాన్ హోం మంత్రి ఖలీఫా సిరాజుద్దీన్ హక్కానీ హెచ్చరించారు. "ఒక దేశం తన ప్రయోజనాల కోసం మరో దేశ భూభాగాన్ని ఉల్లంఘించడం అనైతికం. మా సహనాన్ని పరీక్షిస్తే, మా ప్రతిస్పందన చాలా ఘాటుగా ఉంటుంది. ప్రపంచ సామ్రాజ్యవాదులను ఎదుర్కొన్న వాళ్ళం. యుద్ధ భూమిలో అఫ్గాన్‌లు తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. మళ్లీ పోరాడటంలో మాకు ఇబ్బంది లేదు" అని తాలిబాన్ ప్రతినిధులు పాక్‌ను హెచ్చరించారు. చర్చలు విఫలమవడంతో, సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం మళ్లీ నెలకొంది. ఇరు దేశాల మధ్య ఘర్షణలు, పరస్పర దాడులతో భారీ ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు