భారత్ బాటలోనే ఆఫ్ఘనిస్తాన్.. పాకిస్థాన్‌ని ఎండబెట్టే దిశగా నిర్ణయం

పాకిస్తాన్‌లో ప్రవహించే ముఖ్యమైన నది కునార్‌పై డ్యామ్‌లను వీలైనంత త్వరగా నిర్మించాలని తాలిబాన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంద్‌జాదా ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం పాకిస్తాన్‌కు పెద్ద షాక్‌గా మారనుంది. కునార్ నది పాకిస్తాన్ వ్యవసాయం, నీటి అవసరాలకు కీలకం.

New Update
kabul river

పహ‌ల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌తో సింధూ జ‌లాల ఒప్పందాన్ని భార‌త్ ర‌ద్దు చేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే అదే బాటలో ఆఫ్ఘనిస్తాన్ కూడా న‌డుస్తోంది. ప్రస్తుతం పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్తాన్ స‌రిహ‌ద్దుల్లో తీవ్ర ఉద్రిక్తల ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ సంద‌ర్భంగా పాకిస్థాన్‌లోకి ప్రవేశించి కునార్(కాబుల్‌) న‌ది నీటి ప్రవాహాన్ని అడ్డుకునేందుకు తాలిబన్ నాయకులు కీలక నిర్ణయం తెలుస్తోంది. పాకిస్తాన్‌లోకి ప్రవహించే ముఖ్యమైన నది అయిన కునార్‌పై డ్యామ్‌లను వీలైనంత త్వరగా నిర్మించాలని తాలిబాన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంద్‌జాదా ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం పాకిస్తాన్‌కు పెద్ద షాక్‌గా మారనుంది.

కునార్ నది పాకిస్తాన్ వ్యవసాయం, నీటి అవసరాలకు చాలా కీలకం. ఈ నదిపై డ్యామ్‌ల నిర్మాణం చేపడితే, పాకిస్తాన్‌కు నీటి ప్రవాహం గణనీయంగా తగ్గుతుంది. దీనిపై ఇప్పటికే పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇరు దేశాల మధ్య నదీ జలాల పంపిణీపై ఎలాంటి అధికారిక ఒప్పందం లేకపోవడం ఈ వివాదానికి ప్రధాన కారణం. తాలిబాన్ల తాజా నిర్ణయం భారత్ తీసుకున్న చర్యలను పోలి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో ఉగ్రదాడుల నేపథ్యంలో భారత్ కూడా పాకిస్తాన్‌కు సింధూ నది జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఈ నేపథ్యంలో, తాలిబాన్ దేశీయ కంపెనీలతోనే డ్యామ్‌ల నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని ఆదేశించడం గమనార్హం. సరిహద్దు ఘర్షణలు, ఉగ్రవాద ఆరోపణల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా ఉన్న సమయంలో, తాలిబాన్ తీసుకున్న ఈ నిర్ణయం నీటి యుద్ధానికి దారితీసే అవకాశం ఉందని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు