/rtv/media/media_files/2025/10/10/bombs-attack-in-kabul-2025-10-10-07-36-22.jpg)
Bombs attack in Kabul
PAK ATTACK ON KABUL : తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ (టిటిపి) స్థానాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఫైటర్ జెట్‌లు కాబూల్ నగరంలో వైమానిక దాడులకు తెగబడ్డాయి. దీంతో ఆఫ్ఘనిస్తాన్ రాజధాని పేలుళ్ల శబ్దంతో దద్దరిల్లింది. నగరంపై అసాధారణ వైమానిక దాడులు జరిగినట్లు ఆఫ్ఘన్ అధికారులు ధృవీకరించారు. దీనిపై తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ Xలో పోస్ట్ చేశారు, “కాబూల్ నగరంలో పేలుడు శబ్దం వినిపించింది. అయితే, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అంతా బాగానే ఉంది, సంఘటనపై దర్యాప్తు జరుగుతోంది, ఇప్పటివరకు ఎటువంటి నష్టం జరిగినట్లు నివేదిక రాలేదు. అని పోస్ట్ చేశారు.పేలుడు తర్వాత కాల్పుల శబ్దం కూడా వినిపించిందని నివాసితులు తెలిపారు.
Also Read: హైకోర్టు స్టే.. ఎన్నికలకు రేవంత్ సర్కార్ ముందు 3 ఆప్షన్లు
అయితే ఇది ముమ్మాటికి పాకిస్తాన్ పనేనని ఆఫ్ఘన్ పౌరులు ఆరోపిస్తున్నారు.-- భారత్‌తో ఆఫ్ఘనిస్తాన్ స్నేహాన్ని తట్టుకోలేకపోతున్న పాకిస్తాన్-- ఆఫ్ఘన్ విదేశాంగ శాఖ మంత్రి భారత్‌లో పర్యటిస్తున్న సమయంలోనే కాబూల్‌లో ఈ దాడులకు పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. తెహ్రీక్ ఈ తాలిబన్ అగ్రనేతలే లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది.-- అర్థరాత్రి కాబూల్ నగరంపై బాంబుల వర్షం కురిపించినట్లు పౌరులు ఆరోపిస్తున్నారు. --భారత్‌లో ఆఫ్ఘన్ ఫారిన్ మినిస్టర్ అమీర్ ఖాన్ ముత్తాఖీ పర్యటన సందర్భంగా ఈ పేలుళ్లు జరిగాయి.-- పర్యటనలో భాగంగా ఆయన భారత రక్షణశాఖ అధికారులతో కీలక భేటీలో పాల్గొననున్నారు.-- ఇరు దేశాల ప్రతినిధుల భేటీతో పాకిస్తాన్ భయపడుతుంది. దీంతో విషయాన్ని డైవర్ట్ చేయడానికే ఇలా దాడులకు తెగబడినట్లు తెలుస్తోంది.