విషాదం.. తల్లీకూతుళ్లు 18వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య
నార్సింగ్‌లోని మై హోమ్ అవతార్ అపార్ట్మెంట్లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ నివాసం ఉంటున్న మానస తన కూతురుతో కలిసి అపార్ట్మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. గత కొంత కాలంగా భర్తతో తనకు ఉన్న విభేదాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.