హైదరాబాద్‌లో జవహరనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. యాసిడ్ తాగి సూసైడ్ చేసుకునేందుకు యత్నించిన డిగ్రీ విద్యార్థిని ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ బుధవారం ప్రాణాలు కోల్పోయింది. ఇక వివరాల్లకి వెళ్తే.. న్యూ భవనీనగర్‌కు చెందిన పూర్ణిమ అనే అమ్మాయి డిగ్రీ చదువుతోంది. మంగళవారం సాయంత్రం కళాశాల నుంచి ఇంటికి వచ్చాక ఆమె యాసిడ్ తాగి సూసైడ్ చేసుకునేందుకు యత్నించింది. ఆమెను చూసిన తల్లిదండ్రులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. Also Read: భార్యను చూసుకునేందుకు రిటైర్మెంట్ తీసుకున్న భర్త.. చివరికి ఊహించని షాక్ బుధవారం చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. అయితే ప్రేమ పేరుతో నిఖిల్ అనే యువకుడు వేధిస్తున్నాడని.. అతడి వేధింపులు తట్టుకోలేకే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వాళ్ల ఫిర్యాదు మేరకు జవహార్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. Also Read: యూపీలో దారుణం..పుట్టినరోజని పిలిచి బట్టలిప్పించి..మూత్రం తాగించారు అయితే పోస్టుమార్టం పూర్తయ్యాక కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. తమ కూతురు మరణానికి కారణమైన యువకుడిని ఇప్పటిదాకా ఎందుకు అరెస్టు చేయలేదంటూ నిలదీశారు. వెంటనే అతడిని అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రస్తుతం కేసును విచారిస్తున్నామని.. నిందితుడిని అరెస్టు చేస్తామని పోలీసులు సర్దిచెప్పారు. దీంతో చివరికి కుటుంబసభ్యులు ఆందోళన విరమించారు. Also Read: అక్రమ సంబంధాల్లో మహిళలే టాప్.. ఇండియాలో ఆ రాష్ట్రమే నెం.1 Also Read: దక్షిణ కొరియాలో పెరుగుతున్న వృద్ధుల సంఖ్య.. ఆందోళనలో ప్రభుత్వం