/rtv/media/media_files/2025/01/14/bSBKU7V7Z66sIcxGFDWb.jpg)
IIT Khargpur
షాన్ మాలిక్...ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ధర్డ్ ఇయర్ స్టూడెంట్. ప్రతిభావంతుడు. బాగా చదివేవాడని...మంచి ఫ్యూచర్ ఉన్న విద్యార్ధి అని కాలేజీ ఉపాధ్యాయులు చెబుతున్నారు. కానీ ఏమయిందో ఉన్నట్టుండి ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చియ బెంగాల్ ఖరగ్‌పూర్‌లో ఐఐఈ ఉన్న తమ కొడుకును చూసేందుకు అక్కడకు వెళ్ళారు. ఫోన్ చేశారు.. కానీ లిఫ్ట్ చేయలేదు. ఎంతసేపు కాల్ చేసిన తియ్యకపోయేసరికి అనుమానం వచ్చింది. దీంతో కంగారుపడి హాస్టల్ దగ్గకు వెళ్లి చేశారు. అక్కడ కుమారుడు శవమై కనిపించాడు. దీంతో వారు షాక్‌కు గురైయ్యారు. ముందు రోజ రాత్రికి కూడా షాన్ తమతో మాట్లాడాడని..తాము వస్తున్నట్టు చెప్పామని అప్పుడు అతను మామూలుగానే ఉన్నాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. కానీ ఇక్కడకు వచ్చి చూస్తూ శవమై కనిపించాడని కన్నీరు మున్నీరయ్యారు.
తన రూమ్‌లో ఉరివేసుకుని...
హాస్టల్ లో షాన్ తన రూమ్‌లో తులపు వేసుకుని ఉరివేసుకున్నాడు. పదేపదే కాల్ చేసినా స్పందించకపోవడంతో అతని తల్లిదండ్రులు మరియు ఇన్‌స్టిట్యూట్ సిబ్బంది హాస్టల్ గది తలుపును బలవంతంగా తెరవవలసి వచ్చిందని అధికారి తెలిపారు. దీనిపై అంతర్గత విచారణ చేస్తామని ఇనిస్టిట్యూట్ అధికారులు చెప్పారు. సంఘటనను గుర్తించిన వెంటనే క్యాంపస్ సెక్యూరిటీ, వైద్య బృందాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. షాన్ మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మాలిక్ మరణం వెనుక ఉన్న పరిస్థితులపై పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తామని తెలిపారు. అధికారులకు సహకరిస్తామని ఇనిస్టిట్యూట్ తెలిపింది.