Loan App Harassment: లోన్ యాప్ వేధింపులు.. మరో యువకుడు బలి

లోన్ యాప్స్ వేధింపులు భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్‌లో చోటుచేసుకుంది. లోన్‌యాప్‌లో తీసుకున్న రూ.3 లక్షలు కట్టలేకపోవడంతో ఏజెంట్లు వేధింపులు పెట్టారు. దీంతో మానసిక ఆవేదన చెంది ఆ యువకుడు పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

New Update
Loan Apps Ads : నకిలీ లోన్ యాప్స్ ప్రకటనలపై ప్రభుత్వం కొరడా 

లోన్ యాప్‌లకు బాగా అలవాటు పడి ప్రాణాలు తీసుకున్న కేసులు ప్రస్తుతం పెరిగిపోతున్నాయి. అవసరానికి డబ్బులు లేవని లోన్ తీసుకోవడం ఆ తర్వాత సరైన సమయానికి కట్టరు. దీంతో వారు వేధింపులు పెట్టడం మొదలుపెడతారు. అటు డబ్బులు కట్టలేక, ఇటు వేధింపులు భరించలేక చివరకు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇటీవల ఓ యువకుడు లోన్ యాప్ వేధింపులకు బలయ్యాడు. 

ఇది కూడా చూడండి:  బలపడుతున్న అల్పపీడనం.. మూడు రోజులు అతి భారీ వర్షాలు

లోన్ తీసుకున్న డబ్బులు కట్టలేక..

వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లాలోని కాట్రియాల గ్రామంలో ఉంటున్న మద్ది గంగాధర్ మిషన్ భగీరథలో సంప్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. డబ్బులు అవసరం ఉండి లోన్ యాప్‌లో రూ.3 లక్షలు తీసుకున్నాడు. వాటికి సరిగ్గా డబ్బులు నెలా నెలా కట్టలేకపోవడంతో లోన్ యాప్ ఏజెంట్లు వేధించారు. 

ఇది కూడా చూడండి: Bengaluru: ఫ్లాట్ మేట్ కోసం ఎక్స్‌లో పోస్ట్..3లక్షలకు పైగా వ్యూస్

డబ్బులు తీర్చలేక, వారి బాధ భరించలేక తనలో తాను ఎంతో మానసిక ఆవేదన చెందాడు. చివరకు దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి చికిత్స కోసం స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స తీసుకుంటూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

ఇది కూడా చూడండి:  ఫార్ములా ఈ రేసు లో ఏసీబీ విచారణ కోరుతూ సిఎస్ శాంతకుమారి ఏసీబీకి లేఖ

ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువగా జరుగుతున్నాయి. తెలిసో తెలియక లోన్ యాప్స్‌‌లో డబ్బులు తీసుకోవడం, బెట్టింగ్ యాప్స్ వాడటం వంటివి చేసి పెద్ద మొత్తంలో డబ్బులు పొగోట్టుకుంటున్నారు. ఆ తర్వాత వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. 

ఇది కూడా చూడండి: సైబర్ నేరాలు అరికట్టేందుకు కీలక ప్రాజెక్టు ప్రారంభించిన పోలీసులు

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు