తల్లి ప్రేమ వెలకట్టలేనిది. తల్లిని మించిన యోధులు ప్రపంచంలో ఎవ్వరూ లేరు. అందువల్లనే తల్లికి చిన్న కష్టం వచ్చినా.. ఏ కొడుకూ చూస్తూ ఊరుకోడు. ఎంతటి దూరమైనా వెళ్తాడు. తాజాగా అలాంటిదే జరిగింది. అనారోగ్యంతో ఓ తల్లి మరణించింది. తన తల్లి మరణాన్ని జీర్ణించుకోలేని కుమారుడు కఠిన నిర్ణయం తీసుకున్నాడు. తల్లి లేని తన జీవితాన్ని ఊహించుకోలేకపోయాడు. దీంతో తాను కూడా తన తల్లి దగ్గరకే వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నాడు. అనంతరం తల్లి చనిపోయిన గదిలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
తల్లి మరణం తట్టుకోలేక
హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ లాలాపేటలో ఈ విషాదకర ఘటన జరిగింది. లక్ష్మీ, ఆమె కుమారుడు అభినవ్ గత ఎనిమిది ఏళ్లుగా సికింద్రాబాద్‌లోని లాలాపేటలో ఒక అద్దె ఇంట్లో ఉంటున్నారు. అయితే తల్లి లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో తన తల్లి మరణాన్ని తట్టుకోలేని కొడుకు అభినవ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఏ గదిలో అయితే తన తల్లి చనిపోయిందో.. అదే గదిలో అభినవ్ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Also Read: ఢిల్లీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కేజ్రీవాల్‌పై పోటీ ఎవరో తెలుసా?
ఇక ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా ఇంట్లో ఇద్దరి మృతదేహాలు ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా పోలీసులు, స్థానికులు ఉలిక్కి పడ్డారు.
Also Read: అగ్రరాజ్యంలో ఆగని కాల్పులు..ఆ విషయంలో అమెరికా ఫెయిల్!
నాకు నాన్నలేడు
అనంతరం అభినవ్ రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు. ఆ నోట్ ప్రకారం.. ‘‘నాకు, అమ్మకు గత కొద్ది రోజులుగా ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. నాన్న కూడా లేరు. మా బంధువుల గురించి వెతకొద్దు. నన్ను క్షమించండి’’ అంటూ ఆ నోట్‌లో రాసుంది. అయితే ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన లాలాగూడ పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.