/rtv/media/media_files/2025/01/06/kfocN1Ty0gTLfZjix9PD.jpg)
Car Fired
సోమవారం సాయంత్రం మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారులో ఇద్దరు సజీవదహనమైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలు కీలక ట్విస్టు చోటుచేసుకుంది. కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయని ముందుగా పోలీసులు కూడా భావించారు. కానీ దీనిపై విచారణ చేయగా కీలక విషయాలు బయటపడ్డాయి. కారులో సజీవదహనమైన ఇద్దరూ కూడా ప్రేమ జంట అని, కారులో పెట్రోల్ పోసుకొని వారే నిప్పంటించుకొని సూసైడ్ చేసుకున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో చేరింది. మృతులు శ్రీరామ్, లిఖితగా గుర్తించారు.
Also read: 18 మందిని మింగిన 'ర్యాట్ హోల్'.. 300 అడుగుల లోతులో!
అయితే ఇరు కుటుంబాల పెద్దలు వాళ్ల పెళ్లికి అంగీకరించలేదని.. అందుకే ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు తెలిపారు. అంతేకాదు సూసైట్ చేసుకునే ముందు కూడా వాళ్ల తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఘటనాస్థలంలో పోలీసులు 3 పేజీల లేఖను స్వాధీనం చేసుకున్నారు. శ్రీరామ్ స్వస్థలం యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం జమ్ములపేట. ఇక లిఖిత మేడ్చల్ జిల్లాకు చెందినట్లుగా పోలీసులు వెల్లడించారు.
Also Read: మాటిస్తున్నా.. ఏ ఒక్కడినీ వదలం: బీజాపూర్ ఘటనపై అమిత్ షా!
Also read: 6కి చేరిన హెచ్‌ఎంపీవీ కేసులు.. ICMR కీలక ప్రకటన