KOTA: కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది 17 మంది

రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు ఆగడం లేదు. తాజాగా మరో జేఈఈ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. గురువారం హాస్టల్ గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Death

రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు ఆగడం లేదు. తాజాగా మరో విద్యార్థి సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. బిహార్‌లోని వైశాలి జిల్లాకు చెందిన 16 ఏళ్ల బాలుడు కోటాలో జేఈఈకి కోచింగ్ తీసుకుంటున్నాడు. దాదాబరీ ప్రాంతంలోని ఓ హాస్టల్‌లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే గురువారం హాస్టల్ గదిలోని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు.  

Also Read: రాహుల్ గాంధీపై నమోదైన కేసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ

 అతడి రూమ్‌లో కూడా ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దీనిపై విచారణ జరుపుతున్నారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంటకు ఎంత తలుపు కొట్టినా ఆ బాలుడు డోర్‌ తీయలేదని ఇతర విద్యార్థుల సమాచారం మేరకు అక్కడికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. డోర్‌ పగలగొట్టి చూడగా విద్యార్థి మృతదేహాన్ని గుర్తించామని పేర్కొన్నారు. 

Also Read: దారుణం.. క్రిస్మస్ వేడుకలలో టెర్రరిస్ట్ ఎటాక్.. 15 మంది మృతి!

JEE Student Suicide

బాలుడి ఆత్మహత్యపై అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించామని.. పోస్టుమర్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించామని చెప్పారు. ఇదిలాఉండగా కోటాలో ఐఐటీ, నీట్ లాంటి పోటీ పరీక్షలకు కోచింగ్‌ తీసుకుంటున్న విద్యార్థుల్లో ప్రతీ ఏడాది కొందరు సూసైడ్ చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా 17 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. 2023లో 26 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. 

Also Read: కేటీఆర్‌కు ఈడీ ఉచ్చు.. హైకోర్టు ఆర్డర్స్ ఉన్నా అరెస్ట్ తప్పదా!?

ఒత్తిడి వల్లే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇవి ఆగడం లేదు. విద్యార్థుల కోసం రాజస్థాన్‌ ప్రభుత్వం హెల్ప్‌లైన్ నెంబర్లు కూడా అందుబాటులో ఉంచింది. అయినప్పటికీ కూడా ఆత్మహత్యలు ఆగడం లేదు.

Also Read :  ఇలా స్టైల్ చేసుకుంటే.. క్రిస్మస్ పార్టీలో అందరి కళ్ళు మీపైనే!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు