Betting App: తండ్రీకొడుకును బలితీసుకున్న ఆన్ లైన్ బెట్టింగ్.. ఒకరికోసం మరొకరు దారుణం!
ఆన్ లైన్ బెట్టింగ్ కారణంగా మరో కుటుంబం ఆగమైంది. కరీంనగర్ జిల్లా మన్నెంపల్లికి చెందిన నిఖిల్ రావు అప్పులు చేసి చనిపోగా.. కొడుకు మరణం తట్టుకోలేక తండ్రి తిరుపతిరావు పురుగుల మందు తాగి మరణించారు. ఈ ఘటనపై సజ్జనార్ పోస్ట్ పెట్టి యువకులను హెచ్చరించారు.