/rtv/media/media_files/2024/11/05/id8litA7yPAhjlG9maZX.jpg)
Couple suicide : కొందరు యువతీ యువకులు ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విడిపోయి బ్రతకలేమని తనువులు చాలిస్తున్నారు. తాజాగా మరో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పురుగుల మందు సేవించి ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన యాదాద్రి జిల్లాలో చోటుచేసుకుంది.
ఇది కూడా చూడండి: Telangana Crime: తెలంగాణలో దారుణం.. కోర్టు భవనం పైనుంచి పిల్లల్ని తోసి.. దంపతులు ఆత్మహత్యయత్నం
బీబీనగర్ (మ) కొండమడుగు రాగాల రిసార్ట్స్ లో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. రిసార్ట్ సిబ్బంది ఎన్నిసార్లు తలుపు కొట్టినా తీయకపోవడంతో అనుమానం వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా ఇద్దరూ నిర్జీవంగా పడి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతులది హైదరాబాద్ లోని రామంతాపూర్ గా గుర్తించారు. ప్రేమ జంట ఆత్మహత్యపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: Ee Nagaraniki Emaindi: "ఈ నగరానికి ఏమైంది" ఫ్యాన్స్ కి పండగే.. సీక్వెల్ పోస్టర్ అదిరింది!